జోగులాంబ గద్వాల్

మల్దకల్ తిమ్మప్ప స్వామికి వెండి వితరణ

Submitted by bheemaraidu on Sat, 01/10/2022 - 13:16

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి, వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఆర్.ఎన్ బీచుపల్లి అనంతమ్మ దంపతులు 250 గ్రాముల వెండిని స్వామికి బహుకరించారు. శుక్రవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు కు అందజేయగా, వారికి ఘనంగా సన్మానం చేశారు. దేవాలయంలో వెండి తొడుగు కోసం 108 కిలోల వెండిని సేకరించే పనిలో భాగంగా, ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి భక్తుల నుండి సేకరిస్తున్నట్టు తెలిపారు.

మండల పరిషత్ సర్వసభ సమావేశంలో హాజరైన ఎమ్మెల్యే

Submitted by Thirumal on Thu, 15/09/2022 - 17:17

జోగులాంబ గద్వాల్ జిల్లా సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి): ..గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు మండల అభివృద్ధి భాగంలో పలు అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగినది. 

 గద్వాల్ ఎమ్మెల్యే  మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్వాల నియోజకవర్గంలో పాటు మండలాలు గ్రామాల అభివృద్ధి కొరకు అహర్నిశలు సీఎం కేసీఆర్ కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు. 

వ్యవసాయ రంగంపై సమీక్ష 

మూలా నక్షత్ర దీపారాధన భక్తులకు విన్నపం

Submitted by Thirumal on Thu, 15/09/2022 - 15:36

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-  జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ కేంద్రములో శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్ర దీపారాధన చేయు భక్తులకు చేయు విన్నపం ఏమనగా గత తొమ్మిది సంవత్సరాలుగా ఎల్కూరు రాఘవేంద్రరావు, విఠలాపురం రుక్మాంగద రావు, బిజెపి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో నిరాఘాటంగా కొనసాగి ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి సమ్మతితో దేవాలయం ఆధ్వర్యంలో మూలా నక్షత్ర దీపారాధన నిర్వహించుటకు చర్యలు తీసుకున్నారు, ఇందుకుగాను గతంలో    సమకూరిన సహకారంతో దీపపు ట్రే దే

జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్బంగా ర్యాలీ

Submitted by bheemaraidu on Thu, 15/09/2022 - 13:09

జోగులాంబగద్వాల్ ప్రజాజ్యోతి ప్రతినిధి సెప్టెంబర్ 14,.  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో "నేషనల్ డివైర్మింగ్ డే" జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా బుధవారం గద్వాల జిల్లా యందు ర్యాలీ ప్రారంభించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్  ఆదేశానుసారం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శశికళ మరియు డాక్టర్ మారుతి నందన్ చేతుల మీదుగా జండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ నందు గద్వాల జిల్లా అంగన్వాడి సెంటర్స్ టీచర్లు మరియు ఆశా వర్కర్లు, జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు ప్రాక్టీసింగ్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీ తీయడం జరిగింది.

జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

Submitted by bheemaraidu on Wed, 14/09/2022 - 18:20

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 14 :బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి మూడు రోజుల పాటు నిర్వహించు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లు, పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సీఎం సహాయనిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే 

Submitted by bheemaraidu on Wed, 14/09/2022 - 18:15

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 14 :  బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ కు  చెందిన లబ్దిదారుడు షేకున్ తండ్రి  సీరిఫ్   చికిత్స నిమిత్తం   ఎమ్మెల్యే  బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి  చేతుల మీదుగా సీఎం సహాయనిధి క్రింద రూ. 62,500   రూపాయలు చెక్కును వారి కుటుంబ సభ్యులకు  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్,   కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, తెరాస పార్టీ నాయకులు బషీర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్

Submitted by bheemaraidu on Tue, 13/09/2022 - 20:00

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 13: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ వాహనదారులకు హెచ్చరించారు. గద్వాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలో మంగళవారం ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహనా కల్పించారు.ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ..ట్రాఫిక్ చలాన్లపై అవగాహనా కల్పించారు.  

ప్రశాంతంగా ఉన్న గ్రామంలో మళ్లీ గొడవలు షురూ

Submitted by sridhar on Tue, 13/09/2022 - 10:04

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్12 : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని ఎల్కూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు సామాజిక వర్గాలు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజాన్ రతన్ కుమార్ సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గ్రామాన్ని సందర్శించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

ఎంబి చర్చికి ముపై నాలుగు లక్షల రూపాయల చెక్కును అందచేసిన ఎమ్మెల్యే అబ్రహం

Submitted by sridhar on Sun, 11/09/2022 - 15:09

అలంపూర్: సెప్టెంబర్ 11 (ప్రజా జ్యోతి) ఐజ మున్సిపాల్టీ నందు ఎంబి బేతేలు చర్చికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యొక్క క్రిస్టియన్ మైనార్టీ నుండి చర్చి నిర్మాణం కొరకు ప్రభుత్వము నుండి 34 లక్షల రూపాయల 3 వేల రూపాయలు చెక్కును  సంఘం పెద్దలకు అందచేశారు అంతకు ముందు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎమ్మెల్యే  కి సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికి పూలమాల శాలువాతో సత్కరించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం కెసిఆర్  అన్ని మతాల వారికి చర్చిల కు కానీ మజీద్ లకు కానీ దేవాలయాల అభివ్రుది కొరకు   అన్ని మతాల వారికి అతీతంగా చేయూత నిస్తోంది అని అన్నారు

నూతన రేషన్ డీలర్ షాప్ లను ప్రారంబించిన ఎమ్మెల్యే అబ్రహం

Submitted by sridhar on Sun, 11/09/2022 - 14:29

అలంపూర్: సెప్టెంబర్ 11(ప్రజా జ్యోతి) ఇటిక్యాల మండలం మునగాల గ్రామంలో మరియు గోపాల్ దీన్నే గ్రామాల్లో నూతన రేషన్ డీలర్ షాపులను ప్రారంభించడం జరిగింది ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూతెలంగణ రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి గ్రామ స్వరాజ్యంపై లోతైన అధ్యయనం చేసి నూతన చట్టాని రూపొందించినారన్నారు