హనుమకొండ

మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నేటి యువతకు అవసరం : చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:40

హనుమకొండ, అక్టోబర్02 (ప్రజాజ్యోతి)./... మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నేటి యువతకు అవసరమనిచీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 90 లక్షల నిధులతో పబ్లిక్ గార్డెన్ లో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గాను భూమిపూజకు శంకుస్థాపన చేశారు.

ఘనంగా గాంధీ, శాస్త్రిజీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:32

హనుమకొండ, అక్టోబర్02 (ప్రజాజ్యోతి),../, జాతిపిత మహత్మా గాంధీజీ, భారత దేశ మాజీ ప్రధాని స్వర్గీయ లాల్‌ బహదూర్‌ శాస్త్రిజీ జయంతి వేడుకలను పురస్కరించుకొని  ఆదివారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మహత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి నేతల చిత్రపటాలకు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.

అనధికార నిర్మాణాలు, ప్రయివేట్ హోర్డింగ్స్ గుర్తించండి : నగర మేయర్ గుండు సుధారాణి

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:35

హనుమకొండ,  సెప్టెంబర్30 (ప్రజాజ్యోతి)/...జిడబ్లుఎంసి పరిధిలోఅనధికార నిర్మాణాలు, ప్రయివేట్ హోర్డింగ్స్ గుర్తించాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధానకార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులతో అనధికార నిర్మాణాలు, హోర్డింగ్స్ లపై సమీక్షించి సమర్ధంగా నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలు సులువుగా, వెగవంతంగా భవన నిర్మాణాల అనుమతులు పొందుటకు రాష్ట్రపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ బి పాస్ ను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నదని చెప్పారు.

పారిశుద్ధ్య స్థితిగతులను పరిశీలించిన పౌర సంఘాలు.

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:27

హనుమకొండ, సెప్టెంబర్30 (ప్రజాజ్యోతి)./... బల్దియా పరిధిలో మహానగర పాలక సంస్థ అవలంబిస్తున్న పారిశుద్ధ్య విధానాలను, మారుగుదొడ్ల నిర్వహణలో చేపడుతున్న చర్యలను, ఆస్కి అద్వర్యం లో కొనసాగుతున్న వివిధ రకాల పద్ధతులను వరంగల్  పౌర సంఘాల నాయకులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నగరంలోని అమ్మవారి పేట లో నిర్వహించబడుతున్న మల వ్యర్థాల శుద్దికారణ కేంద్రాన్ని (ఎఫ్.ఎస్.టి.పి), హన్మకొండ లోని అంబెడ్కర్ నగర్ లో గల మురుగు నీటి వ్యర్థాల శుద్దికరణ కేంద్రాన్ని (ఎస్.టి.పి)కేంద్రాన్ని, మడికొండలోని సోషల్ వెల్ఫేర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్.టి.పి.

కార్మికులకు అండగా ఉంటా చీఫ్ విప్ వినయ్ భాస్కర్

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 15:06

హనుమకొండ, సెప్టెంబర్29 (ప్రజాజ్యోతి) ./..బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  గురువారం నియోజకవర్గానికి చెందిన దినసరి కూలీ కట్కూరి వేణు అకాల మరణం చెందగా ఆయనకు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గతంలో కార్మిక శాఖ లో కార్మికుడిగా నమోదు చేయించినందున కార్మిక శాఖ నుండి 1,30,000 రూపాయల పరిహారానికి సంబంధించిన చెక్కును ఆయన భార్యకు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అందజేశారు. అనంతరం ఆమెతో మాట్లాడుతూ భవిష్యత్ లో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు అసంఘటిత కార్మికులకు లేబర్ కార్డులను అందజేశారు.

రాజేశ్వర్ చిత్ర కళ సజీవం

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 13:23

హనుమకొండ, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి),.///.. రాజేశ్వర్ నాన్నూట కుంచె నుంచి జాలువారిన చిత్రాలు చాలా అధ్బుతం గా వున్నాయని, ఆయన గీసిన వర్ణ చిత్రాల్లో సజీవం వుట్టిపడుతుందని ఎం ఎల్ సి బండా ప్రకాష్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు హరిత కాకతీయ లో రాజేశ్వర్ సోలో పెయింటింగ్ గాలరీ ని బండా ప్రకాష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి చిత్రాల ప్రదర్శన నిర్వహించడం సంతోషం అని అన్నారు. రాజేశ్వర్ వేసిన చిత్రాలు వేటికవే సాటి అని అన్నారు. తెలంగాణ జీవన విధానం, సంస్కృతి ని ప్రతిబింబించే చిత్రాలు ఈ గాలరీ లో ఉంచామని జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ తెలిపారు.

అద్భుత పర్యాటక సంపద మన సొంతం ఎం ఎల్ సి బండా ప్రకాష్

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 13:21

హనుమకొండ, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి)..//...తెలంగాణలో అందులోని మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుతమైన పర్యాటక సంపద వుంది. చారిత్రక కట్టడాలు సంప్రదాయాలు కలిగిన గొప్ప నెల ఇది అని ఎం ఎల్ సి బండా ప్రకాష్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా పర్యాటక శాఖ పర్యాటక దినోత్సవం నిర్వహించింది. మంగళవారం హరిత కాకతీయ లో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎం ఎల్ సి బండా ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. వరంగల్లో దేవుని గుట్ట వంటి చారిత్రక కట్టడాలు వాటి గురించి విద్యార్థులు తెలుసుకోవాలి అని అన్నారు.

మహిళా కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:35

హనుమకొండ, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి).//...తెలంగాణ ఆడపడుచుల అత్యంత ప్రీతి పాత్రమైన బతకమ్మ పండుగను మహిళ క్లబ్, ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో  వైభవంగా నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.ఎస్.ఎల్ సౌజన్య తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల ఆవరణ ని  ముగ్గులతో అలంకరించారు. రంగు రంగుల పూలను సేకరించి బతుకమ్మలను అందంగా పేర్చి పాటలు పాడుతూ కోలాటం ఆడారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అమరవేని, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మహిళా అధ్యాపకులు, మహిళ క్లబ్ ఇంచార్జ్ గుగులోతు కవిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే.

ఆక్టోబర్ 1న సీఎం కేసీఆర్‌ పర్యటన యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:07

హనుమకొండ, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి),..//  ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వరంగల్ కలెక్టర్ గోపీ, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్యా, అదనపు  జాయింట్ కలెక్టర్ సంధ్యా రాణి తో కలసి దామెర లో గల ప్రతిమ  హాస్పిటల్, హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అక్టోబర్ 1వ తేదీన  ప్రతిమ హాస్పిటల్ ప్రారంభీస్తారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

ఇద్దరు నకిలీ డాక్టర్లు అరెస్ట్ చదివింది పదోతరగతి చేసేది డాక్టర్ వృత్తి

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:00

హనుమకొండ, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి)../  చదివింది పదోతరగతి చేసేది డాక్టర్ వృత్తి, నకిలీ సర్టిఫికేట్లతో నగరంలో గత 25 సంవత్సరాలు వైద్యులుగా చలామణవుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫర్స్, మట్వాడా, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు.ఈ నకిలీ డాక్టర్ల నుండి రెండు నకిలీ వైద్యవిద్య సర్టిఫికేట్లతో పాటు ఒక లక్ష 28వేల రూపాయల నగదు, డాక్టర్ క్లినికలకు నిర్వహణకు సంబంధించిన పరికరాలు, మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.