చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యం: జేఏసీ కమిటీల ప్రకటన

Siddipet Bureau
1 Min Read

చేర్యాల మార్చి 16(ప్రజాజ్యోతి):చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ఉధృతం చేస్తామని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్ తెలిపారు.సోమవారం చేర్యాల మండల కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివిధ విభాగాలకు సంబంధించిన సమన్వయ కమిటీలను ప్రకటించారు.రాజకీయ వ్యవహారాల సంప్రదింపుల కమిటీ సమన్వయకర్తలుగా అందె బీరయ్య ఫార్వర్డ్ బ్లాక్, అందె అశోక్ సీపీఐ, బస్వగళ్ల సిద్దయ్య బీఎస్పీ కుల సంఘాలు ప్రజా సంఘాల సమన్వయకర్తలుగా బుట్టి సత్యనారాయణ మాల మహానాడు, గడిపే బాలనర్సయ్య ఎమ్మార్పీఎస్, అంబాల రాము గౌడ సంఘం, రిటైర్డ్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సమన్వయకర్తలుగా పిల్లి చంద్రం, పోలోజు వెంకటాద్రి, కరెడ్ల రాజిరెడ్డి, ఎక్కలదేవి సుధాకర్, రైతు సంఘాల సమన్వయకర్తలుగా ఈరి భూమయ్య, కత్తుల భాస్కర్ రెడ్డి, నంగి కనకయ్య, పిల్లి రవి, విద్యార్థి, యువజన సంఘాల సమన్వయకర్తలుగా రామగళ్ల నరేష్, చందా శ్రీకాంత్ ప్రవేట్ విద్యాసంస్థల సమన్యాయకర్తలుగా తౌట రామాంజనేయులు, ఎండి అక్బర్, దేవేందర్ రెడ్డి మహిళా సంఘాల సమన్వయకర్తలుగా పొన్నబోయిన మమత, సుంకోజు రజిత, లైట్ మోటార్ యూనియన్ పచ్చిమడ్ల మహేందర్, పాక బాలయ్య, ఆర్ఎంపీల సమన్వయకర్తలుగా నరసింహారెడ్డి చేర్యాల, రమేష్ మద్దూరు, కనకయ్య వీరన్నపేట, కనకయ్య కడవేరుగు క్రైస్తవ అసోసియేషన్ సమన్వయకర్తలుగా తెట్టె బావి డేవిడ్, మోజెస్, ఎర్రగుంట్ల ప్రభాకర్ లను ఎన్నిక చేశారు. త్వరలో మండల కమిటీలు ప్రకటించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ జేఏసీ నేతలు అందె అశోక్, అందె బీరయ్య, బుట్టి సత్యనారాయణ, గడిపే బాలనర్సయ్య, పోలోజు వెంకటాద్రి, ఆత్మకూరి హరిక్రిష్ణ, తదితరులు ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *