వాజేడు

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన భాజపా నాయకులు

Submitted by sridhar on Tue, 06/09/2022 - 18:19

వాజేడు, సెప్టెంబర్ 6, ప్రజాజ్యోతి: వాజేడు మండలంలోని చింతూరు గ్రామానికి చెందిన తోటపల్లి రమేష్, స్వరూప దంపతులు రెండు రోజుల క్రితం మండలంలోని సుందరయ్య కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసినదే ఐతే మంగళవారం భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సతీష్ కుమార్ వాజేడు మండల భాజపా నాయకులతో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించి ఆకుటుంబానికి 25 కేజీల బియ్యం, రెండువేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

లారీ, ద్విచక్ర వాహనం డీ ఘటనలో భార్యాభర్తలు దుర్మరణం

Submitted by sridhar on Sun, 04/09/2022 - 17:47

వాజేడు, సెప్టెంబర్ 4, ప్రజాజ్యోతి: లారీ ద్విచక్ర వాహనం ఢీకొని భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామా సమీపంలోని 163 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.