నారాయణ్ పుర్

వసతి గృహంలో గడ్డిని తొలగిస్తున్న విద్యార్థినులు

Submitted by veeresham siliveru on Thu, 08/09/2022 - 18:05
  •  
  • పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి- ఏ ఎస్ డబ్ల్యూ ఓ రఘురామయ్య

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 8, ప్రజా జ్యోతి : తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రఘురామయ్య విద్యార్థులకు సూచించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నీ బాలికల వసతి గృహంలో గురువారం స్వచ్ఛ హాస్టల్ కార్యక్రమం నిర్వహించారు. వసతి గ్రామం ఆవరణలోని గడ్డి మొక్కలను, చెత్త ముచ్చదాన్ని తొలగించారు. వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి సీజనల్ వ్యాధులు రావని తెలిపారు. విద్యార్థులకు అందించే మెనూ పరిశీలించారు. ఆహార పదార్థాలను చూశారు.

విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేస్తున్న సర్పంచ్ శ్రీహ

Submitted by veeresham siliveru on Tue, 06/09/2022 - 11:15
  • విద్యార్థులకు దుస్తులు పంపిణీ

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 5,  ప్రజాజ్యోతి: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సర్పంచ్ శ్రీహరి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం  విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

మునుగోడు కి వెళ్తున్న రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ నాయకులు

Submitted by Sathish Kammampati on Sat, 03/09/2022 - 16:19
  • సంస్థాన్ లో రేవంత్ రెడ్డికి స్వాగతం

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 3 ( ప్రజా జ్యోతి) టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాదు నుండి మునుగోడు కు వెళుతుండగా సంస్థాన్ నారాయణ పురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.  మన మునుగోడు మన కాంగ్రెస్ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం నాడు రేవంత్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి ఉప ఎన్నిక మండల ఇన్చార్జిలు సత్యనారాయణ, బలరాం నాయకులు శాలువా కప్పి స్వాగతం పలికారు . అలాగే మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గంగాపురం లింగమయ్య గౌడ్ సంతాపం తెలుపుతున్న సిపిఐ రాష్ట్ర నాయకులు

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 13:08

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 1 ( ప్రజా జ్యోతి) సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన సిపిఐ నాయకుడు గంగాపురం లింగమయ్య గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వల్ల వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నాడు మండల కేంద్రం లో లింగమయ్య గౌడ్ మృతికి సంతాపం తెలిపారు . కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.  అనంతరం మాట్లాడుతూ లింగమయ్య గౌడ్ అనేక ఉద్యమాలను ముందుండి  నడిచారని, నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినట్టు తెలిపారు ,ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తపించేవారని కొనియాడారు. శవయాత్రలో పాల్గొన్నారు.

సంస్థాన్నారాయణపురం తాసిల్దార్ గా శ్రీనివాసరాజు

Submitted by Sathish Kammampati on Tue, 30/08/2022 - 10:52

సంస్థాన్ నారాయణపురం ఆగస్టు 29 (ప్రజా జ్యోతి):

సంస్థాన్ నారాయణపురం మండలం నూతన తహసీల్దారుగా శ్రీనివాసరాజు వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న రవికుమార్ కలెక్టరేట్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం గుండాల మండలంలో తాసిల్దార్ గా పనిచేస్తున్న శ్రీనివాసరాజు సంస్థాన్ నారాయణపూర్ కు బదిలీ చేస్తూ ఇలా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.