నడిగూడెం

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి... ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు..

Submitted by shaikmohammadrafi on Mon, 03/10/2022 - 14:43

నడిగూడెం, అక్టోబర్ 2, ప్రజా జ్యోతి:  నడిగూడెంమండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం మండల పరిషత్ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి ఎంపీపీ యాతాకుల  జ్యోతి మధుబాబు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అహింస మార్గంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన స్వాతంత్రాన్ని సాధించిన మహానీయుడు  జాతిపిత మహాత్మా గాంధీ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు....

Submitted by shaikmohammadrafi on Mon, 03/10/2022 - 11:50

నడిగూడెం, అక్టోబర్ 2, ప్రజా జ్యోతి: మండల కేంద్రంలో  గాంధీ జయంతి   వేడుకలను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ   విగ్రహానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దున్న శ్రీనివాస్, ప్రెస్ క్లబ్   కమిటీ సభ్యులు  పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఘనంగా అమ్మవారికి అభిషేకము...

Submitted by shaikmohammadrafi on Sat, 01/10/2022 - 11:20

నడిగూడెం, సెప్టెంబర్ 30, ప్రజా జ్యోతి: మండల కేంద్రంలోని రత్నవరం గ్రామంలో శుక్రవారం శ్రీ రామలింగేశ్వర సీతారామచంద్ర కనకదుర్గ ఆలయం నందు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారికి అభిషేకము, హోమము, కుంకుమ పూజ,గాజులతో అలంకరణ అత్యంత వైభవంగా పండితులచే  ఘనంగా పూజా  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యాక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది .తీర్ధ  ప్రసాదాలు స్వేకరించారు..

ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఎస్ఐ ఎం. ఏడుకొండలు..

Submitted by shaikmohammadrafi on Sat, 01/10/2022 - 11:16

నడిగూడెం ,సెప్టెంబర్ 30 ,ప్రజా జ్యోతి:  ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి వ్యక్తిగత ఎకౌంట్లలో జరుగుతున్న ఆన్ లైన్ మోసాల పట్ల    ప్రజలు,యువకులు   అప్రమత్తంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ఎం. ఏడుకొండలు  సూచించారు. శుక్రవారం  మండల కేంద్రం లో ఆన్ లైన్ లో జరుగుతున్న మోసాలపై యువకులకు, ప్రజలతో ర్యాలీ నిర్వహించిన  అనంతరం.

అక్రమాలపై చైర్మన్ నిలదీస్తున్న డైరెక్టర్లు.

Submitted by shaikmohammadrafi on Sat, 01/10/2022 - 11:13

నడిగూడెం, సెప్టెంబర్ 30, ప్రజా జ్యోతి:  మండలంలోని తెల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం శుక్రవారం నిర్వహించిన జనసభలో చైర్మన్ బుర్ర వెంకటేశ్వర్లు మాట్లాడుతుండగా సంఘంలో జరిగిన అవకతవకల పట్ల కొందరు డైరెక్టర్లు ప్రశ్నించారు ఈనెల 27 పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయగా డైరెక్టర్లు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవటం వలన కోరం లేక పాలకవర్గ సమావేశాలు  నిర్వహించలేదు. నిర్వహించకుండా జనసభ ఎలా నిర్వహిస్తారని సమావేశం నుండి మినిట్స్,ఏజెండా రికార్డులను డైరెక్టర్లు తీసుకెళ్లారని సంఘ సీఈవో ప్రభాకర్ రావు విలేకరుల సమావేశంలో తెలిపారు .

తల్లి పాలే బిడ్డ కు శ్రేయస్కరం.. ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు...f

Submitted by shaikmohammadrafi on Sat, 01/10/2022 - 10:56

నడిగూడెం, సెప్టెంబర్ 30, ప్రజా జ్యోతి:   పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మండలంలో ఎంపీపీ  కార్యాలయంలో ఐసిడిఎస్, అంగన్వాడీల ఆధ్వర్యంలో   సామూహిక శ్రీమంతాల కార్యక్రమం  శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  ఎంపిపి శ్రీమతి యాతాకుల  జ్యోతి మధు బాబు పాల్గొని మాట్లాడుతూ  గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన ఆహారం పై అంగన్వాడి  కేంద్రాలలో కేసీఆర్  ప్రవేశపెట్టిన ఒక పూట సంపూర్ణ భోజనం పట్ల

మండల కేంద్రంలో వరద నివారణ సహాయ చర్యలు.. ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు..

Submitted by shaikmohammadrafi on Fri, 30/09/2022 - 11:08

నడిగూడెం, సెప్టెంబర్ 28, ప్రజా జ్యోతి:  మండలంలో  రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు  మండల కేంద్రంలో ఎగువ నుంచి వస్తున్న  వరదలకు చెరువు అలుగు పోసి గ్రామంలో కొన్ని వీదులు,గృహాలు జలమయమైన కారణంగా స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్  ఆదేశానుసారం ఎంపీపీ యాతాకుల  జ్యోతి మధుబాబు  వరద నివారణ సహాయ చర్యల భాగంగా అధికారులను స్థానిక ప్రజాప్రతి నిధులను అప్రమత్తం చేసి గ్రామంలో అధికారులు ప్రజాప్రతినిదులతో గురువారం వరద ప్రాంతాలను  పరిశీలించి  తగు చర్యలు తీసుకోవడం జరిగింది.

వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం..

Submitted by shaikmohammadrafi on Thu, 29/09/2022 - 13:57

గ్రామీణ ప్రాంత  ప్రజలకు కార్పోరేట్ వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యం.

 ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..