నల్గొండ

ఆకాష్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Submitted by BikshaReddy on Sat, 24/09/2022 - 19:28

ప్రజా జ్యోతి నల్గొండ (24 సెప్టెంబర్)  తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమిష్టిగా ఐకమత్యంతో జరుపుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ. శనివారం అన్నేపర్థీ ఎక్స్ రోడ్లో గల ఆకాష్ ఇంటర్నేషనల్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా ప్రకృతిని పూజించే పండుగగా బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి, పుట్టిన ఊరికి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మ ను అవమానపరిచిన ప్రకాష్ రెడ్డి ని బిజెపి నుండి సస్పెండ్ చేయాలి

Submitted by Sathish Kammampati on Sat, 17/09/2022 - 16:39

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పై అనుచిత వాక్యాలు తగదు

లకడాపురం వెంకటేశ్వర్లు రజక సంఘాల సమాన్వయ సమితి జిల్లా కన్వినర్ నల్లగొండ

ఎంపీడీవో సుధాకర్ కు వీడ్కోలు పలికిన మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by sridhar on Wed, 14/09/2022 - 18:29

గుర్రంపోడ్:సెప్టెంబర్ 14(ప్రజా జ్యోతి) గుర్రంపోడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విశిష్టమైన సేవలు అందించిన శ్రీపాద సుధాకర్ ఇటీవల చండూరు మండలానికి బదిలీ అయిన సందర్భంగా బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు  ఎంపీడీవో సుధాకర్ ను శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా మంచికంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎంపీడీవో సుధాకర్ మండల  అభివృద్ధి అధికారిగా పనిచేసి ప్రజాప్రతినిధులతో కలుపుగోలుగా ఉంటూ మండలాభివృద్ధికి విశేషమైన కృషి చేశారని పేర్కొన్నారు.

దళితుల భూముల కబ్జాలను ప్రోత్సహిస్తున్న రెవెన్యూ, పోలిస్ ల పై చర్యలు తీసుకొవాలి.

Submitted by sridhar on Wed, 14/09/2022 - 18:03

14-09-2022హన్మకొండ జిల్లాప్రజాజ్యోతి ; దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన దళితుడైన బిక్షపతి భూమిని కబ్జా చేసిన ఎఇ ని ప్రొత్సహించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ దామెర తహసీల్దారు, ఎస్.ఐ తదితరుల పై ఎస్సీ ఎస్టీ  అట్రాసిటి చట్టం సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేసి,సస్పెండ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్,డిబిఎఫ్ అధ్వర్యంలో బుధవారం నాడు కాకతీయ యూనివర్సిటీ ఎస్డిఎల్ సిలోని జాఫర్ నిజాం సెమినార్ హాల్ లో నిర్వహించినతెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం పకడ్బందీ అమలు చేయాలని డిమాండ్

మంత్రి తలసాని శ్రీనివాస్ కు స్వాగతం పలికిన నాయకులు

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 17:29

చిట్యాల సెప్టెంబర్ 14(ప్రజాజ్యోతి) నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గం కిష్టపుర్ వెళ్లే మార్గ మధ్య లో వేలిమినేడు గ్రామం వద్ద బుధవారం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు షిప్ అండ్ గోట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.

సీఐటీయూ 12 మహాసభల కరపత్రం ఆవిష్కరణ

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 17:16
  • నవంబర్ 11,12,13 తేదీలలో నల్లగొండ జిల్లా సిఐటియు 12వ మహాసభలను జయప్రదం చేయాలి
  •  
  •  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారాబోయిన  శ్రీనివాస్ 

చిట్యాల సెప్టెంబర్ 14(ప్రజాజ్యోతి) జరగబోయే మహాసభలు చారిత్రక నేపథ్యం కలిగిన పోరాటాల గడ్డ చిట్యాల పట్టణంలో జరుగుతున్నందున ఈ మహాసభలను జయప్రదం చేయాలని బుధవారం స్థానిక మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో కరపత్రాన్ని విడుదల చేస్తూ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ చిట్యాల ప్రాంతంలో గతంలో యూనియన్లు పెట్టి హక్కుల కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో యాజమాన్యాలు కార్మికుల డిమాండ్లను పరి

చిట్యాల పదో వార్డులో "లో వోల్టేజ్ "సమస్యను పరిష్కరించాలి

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 17:00
  • చికిలంమెట్ల  అశోక్
  •  నూతన బాధ్యతలు చేపట్టిన ట్రాన్స్ కో, ఏ ఈ రవీందర్ కి వినతి పత్రం అందజేసి,
  • శాలువాతో ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు, 10వ వార్డు ప్రజలు

చిట్యాల సెప్టెంబర్ 14(ప్రజాజ్యోతి) నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ ముత్యాలమ్మ గూడెం కాలనీ పరిధిలోని అరవింద హైస్కూల్ ఏరియా పదో వార్డులో, 1991లో ఏర్పాటుచేసిన 100 కెవిఎ ట్రాన్స్ ఫార్మర్ పై అధిక లోడు పడి, లో వోల్టేజ్ ఏర్పడి ఇండ్లలో కూలర్లు, ఫ్రిడ్జ్ లు, ఫ్యాన్లు, మోటర్లు, ఏసీలు తగలబడి పోతూ లైట్లు వెలుగక ఆ కాలనీవాసులు అవస్థలు పడుతూ తీవ్రంగా నష్టపోతున్నారు.గతంలో బదిలీప