Tirumalagiri Sagar

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత

Submitted by Upender Bukka on Tue, 27/09/2022 - 15:12

ప్రజా జ్యోతి తిరుమలగిరి టౌన్ 26సెప్టెంబర్.//..   డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మండల అధ్యక్షుడు షేక్ చాంద్ పాషా సోమవారం తిరుమలగిరి మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా సీనియారిటీ ,పేదరికం ప్రాతిపదికన ఇళ్ల స్థలాల కేటాయించి ఇండ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసి వెంటనే అమలు చేయాలని కోరారు.

దళిత బంధు నిరుపేదల జీవితాల్లో వెలుగు

Submitted by Upender Bukka on Sat, 24/09/2022 - 13:02

ప్రజా జ్యోతి తిరుమలగిరి 23 సెప్టెంబర్..///.దళిత బంధు పథకం పేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని తిరుమలగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తిరుమలగిరి పట్టణంలో  లబ్ది దారుడు బండి పెళ్ళి ఉప్పలమ్మ దళిత బంధు యూనిట్ కింద నెలకొల్పిన కిరాణం షాపును ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్ర గణేష్ ,జగన్,.

ఆర్థిక సాయం అందజేత

Submitted by Upender Bukka on Fri, 16/09/2022 - 15:08

తిరుమలగిరి టౌన్, సెప్టెంబర్ 16, (ప్రజా జ్యోతి );  తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని బిసి కాలనీ కి చెందిన బండారి శ్రీను ముదిరాజ్ మరణించిన విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమ కారుడు, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మెన్  తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ బీసీ కాలనీ కి వెళ్లి  శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి, 5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. పేద కుటుంబాలకు ఆరాధ్య ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు .ఈ కార్య క్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

Submitted by arigenagaraju on Thu, 15/09/2022 - 14:30

 తిరుమలగిరి టౌన్, సెప్టెంబర్ 15  ( ప్రజా జ్యోతి ).హైదరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో తిరుమలగిరి మండలం గుండేపురి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన యస్ యం యస్ చైర్మన్ మేడిద వీరయ్య, మాజీ వార్డ్ మెంబర్ బలిక సత్తయ్య, గుండ్ల ప్రేమయ్య,సంద చంద్రయ్య,గుండ్ల రాములు, మేడే లచ్చయ్య,వయ్యా నాగేష్,గుండ్ల అంజయ్య వారితో పాటు పలువురు నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్  సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.నూతనంగా  టి ఆర్ ఎస్ పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి

అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చారిత్రాత్మక నిర్ణయం

Submitted by Upender Bukka on Wed, 14/09/2022 - 12:11

తిరుమలగిరి టౌన్, సెప్టెంబర్ 13( ప్రజా జ్యోతి )  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి  భారత రాజ్యాంగ నిర్మాత ,సంఘసంస్కర్త ,ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్లమెంట్ భవనంగా పేరు పెట్టాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళ వారం  అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం  హర్షనీయమని టిఆర్ఎస్ పార్టీ నాయకులు , మద్దెల మల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు.

సీఎం చిత్రపటానికి వినతి పత్రం అందజేసిన వీఆర్ఏలు

Submitted by Upender Bukka on Sat, 10/09/2022 - 15:27

తిరుమలగిరి టౌన్, సెప్టెంబర్ 9( ప్రజా జ్యోతి )  తిరుమలగిరి టౌన్ తహశిల్దార్ కార్యాలయం అవరణలో  రాష్ట్ర వీఆర్ఏ, జేఏసీ పిలుపు  మేరకు నిరవేదిక సమ్మె 47వ రోజు లో  భాగంగా   వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  వారు రాసిన వినతి పత్రాన్ని సీఎం కేసీఆర్ చిత్రపటానికి అందజేశారు. కేసీఆర్ గతంలో వీఆర్ఏలకు పే స్కేల్  ఇస్తానని చెప్పి  ఏండ్లు  గడుస్తున్న వాటిని నెరవేర్చకపోవడం  బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మాట ఇచ్చిన ప్రకారం పే స్కేల్  ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేస్కేలు ఇచ్చేంతవరకు సమ్మె కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈ సమ్మెలో భాగంగా విఆర్.

అన్నదానం.. మహా దానం

Submitted by arigenagaraju on Sat, 10/09/2022 - 10:58

ప్రజా జ్యోతి తిరుమలగిరి టౌన్ సెప్టెంబర్ 8 (ప్రజా జ్యోతి) అన్నదానం మహా దానం అని ఆరాధ్య ఫౌండేషన్ చైర్ పర్సన్, తెలంగాణ ఉద్యమకారులు తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ అన్నారు. గురువారం తిరుమలగిరి  మున్సిపాలిటీ పరిధిలో ప్రతిష్టించిన పలు గణపతి విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న దాన కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  శుక్రవారం గణపతి నిమజ్జనం  సందర్భంగా పూజకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు కలగకుండా చూసుకోవాలని సూచించారు.

పర్యావరణాన్ని పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత ...... ఎమ్మేల్యే గాదరి కిషోర్ కుమార్

Submitted by arigenagaraju on Sat, 10/09/2022 - 10:51

ప్రజా జ్యోతి తిరుమలగిరి టౌన్ . పర్యావరణ  పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం 12వ వార్డులో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్టించిన మట్టి వినాయకునికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు  ఈ సందర్భంగా మాట్లాడుతూ.... . మట్టి గణపతి పూజ శ్రేయస్కరమని అన్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం ప్రజలు అత్యధికంగా మట్టి వినాయకులను పూజిస్తున్నారని తెలిపారు.అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.  తాటిపాముల గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులను అందజేశారు.

బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన - ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు

Submitted by veerareddy on Sat, 10/09/2022 - 10:48

తిరుమలగిరి సెప్టెంబర్ 8( ప్రజా జ్యోతి)  తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని  ఎమ్మెల్యే గారి నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు ₹30,02,000/- లక్షల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన

ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకులు సాధించిన మోడల్ స్కూల్ పసునూర్ విద్యార్థులను అభినందించి ఆర్థిక సహాయం చేసిన -ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు

Submitted by veerareddy on Sat, 10/09/2022 - 10:44

తిరుమలగిరి సెప్టెంబర్ 8 (ప్రజా జ్యోతి)   తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో *మోడల్ స్కూల్ పసునూర్ కు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లో ప్రధమ సంవత్సరం లో Bipc లో 440 మార్కుల కు గాను 437 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన కె.సంధ్య ను మరియు  MPC లో 470 మార్కుల గాను 464 మార్కులతో స్టేట్ 4th ర్యాంక్లు సాధించిన కె.హారిక, బి.స్నేహాలత లను తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ గారు విద్యార్థులను సన్మానం చేసి అభినందించి, ముగ్గురు  విద్యార్థులకు తనవంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.10000/- చొప్పున రూ.30,000/- (ముప్ఫై వేల రూపాయలు) ఆర్థిక సహాయం చేసారు.ఈ సందర్భంగా