చౌడాపూర్

గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలి

Submitted by srinu jogu on Fri, 30/09/2022 - 11:06
  •  •పది శాతం రిజర్వేషన్లు జీవోను వెంటనే విడుదల చేయాలి 
  • •వికారాబాద్ జిల్లా ఐక్యవేదిక ఇంచార్జ్ విస్లావత్ రమేష్ నాయక

చౌడపూర్ మండల్ (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెప్టెంబరు 17వ తేదీన బంజారా భవన్ ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా వారంలో రోజుల్లో గిరిజన పదిశాతం రిజర్వేషన్ జీవో విడుదల చేస్తానని హామీ ఇచ్చి వారం రోజులు దాటినా గిరిజన రిజర్వేషన్ జీవో ఇప్పటి వరకు జీవో జారీ చేయలేదని ఇచ్చిన మాటను కట్టుబడి ఉండాలని వెంటనే జీవో విడుదల చేయాలని లంబాడీల ఐక్యవేదిక వికారాబాద్ జిల్లా ఇంచార్జీ వ

ఘనంగా తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి

Submitted by srinu jogu on Tue, 27/09/2022 - 11:33

చౌడపూర్ మండల్ (ప్రజా జ్యోతి) సెప్టెంబర్26:  వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో రజక సంఘాల ఆధ్వర్యంలో  తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 126వ జయంతి ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

నూతన గుడికి శంకుస్థాపన పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

Submitted by srinu jogu on Tue, 27/09/2022 - 11:30

చౌడాపూర్ మండల్(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 26:  వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోనీ అడవి వెంకటాపూర్ గ్రామంలో గోగ్య నాయక్ తండ గ్రామపంచాయతీలో శ్రీ హరి ఓం దత్త దత్తాత్రేయ స్వామి గుడి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నిర్మించబోయే దత్తాత్రేయ గుడికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది

వయస్సు లేని బాలుడు మున్సిపల్ సిబ్బందిగా పని చేస్తున్నాడు

Submitted by srinu jogu on Tue, 27/09/2022 - 11:16

చౌడాపూర్ మండల్ (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 24: వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ పనిలో భాగంగా రోడ్డుకు మట్టి కొడుతున్న సమయంలో గ్రామపంచాయతీ  ట్రాక్టర్ అదును తప్పి క్రింద పడింది.

కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ

Submitted by srinu jogu on Tue, 20/09/2022 - 15:50

చౌడపూర్ మండల్ (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 20:  వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో డిజిటల్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేయాలని సూచించారు. చౌడాపూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెంటల చెన్నయ్య కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎడ్ల మన్యంకొండ ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామ ప్రజలకు డిజిటల్ మెంబర్షిప్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది.

నూతన సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి..రాజ్యాంగ నిర్మాతకు సముచిత గౌరవం కల్పించినట్లే - పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్

Submitted by srinu jogu on Fri, 16/09/2022 - 11:14

చౌడాపూర్ మండల్( ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 15:  వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల్ తరపున భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘసంస్కర్త,సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేసిన మహానుభావుడు,మహానీయుడు మహా మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నూతన సెక్రటేరియట్ కు పెట్టి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు స్వతంత్ర భారత,తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేళ రాజ్యాంగ నిర్మాతకు సముచిత గౌరవం కల్పించినట్లు అయిందని సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ దళిత యువజన సంఘాల తరఫున తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ కార్యదర్శి మందిపాల్ వెంకట్  ధన్యవాదాలు తెలుపడం జరిగ

నూతన సెక్రటేరియట్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షించదగ్గ విషయం

Submitted by srinu jogu on Fri, 16/09/2022 - 11:03

చౌడాపూర్ మండల్ (ప్రజా జ్యోతి):  నూతన సెక్రటేరియట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని దళిత ఉద్యోగ సంఘాల నాయకుడు కర్ణాకర్ అన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ వ్యక్తి మరియు ప్రపంచ మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల సీఎం కేసీఆర్ కు దళిత ఉద్యోగ సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా నూతన సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరును ఖరారు చేయడం పట్ల సహకరించిన ప్రజా ప్రతినిధులకు మరియు నాయకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

గిరిజన ఆశ్రమ పాఠశాలని తనిఖీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Submitted by srinu jogu on Sun, 04/09/2022 - 12:43
  • ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై టిఆర్ఎస్ ప్రభుత్వం చిన్న చూపు
  • కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్

చౌడాపూర్(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 3: వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ కుమార్ చదువుకు ఆమడ దూరంలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రభుత్వ హాస్టళ్లను మరియు ట్రైబల్ వెల్ఫేర్స్, సోషల్ వెల్ఫేర్స్ అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, మాడల్ స్కూళ్లను ప్రారంభించి వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు అభివృద్ధి