రాజంపేట మండల ఫోరం అధ్యక్షుడిగా మీర్ ఇమ్రాన్ అలీ ఏకగ్రీవం
రాజంపేట ఫిబ్రవరి 22 (ప్రజా జ్యోతి)
రాజంపేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్‌లో ఆదివారం ఉపసర్పంచుల మండల ఫోరం ఎన్నికలు నిర్వహించారు రాజంపేట మండలంలోని మొత్తం 18 గ్రామ పంచాయతీలలో 13 గ్రామ పంచాయతీల ప్రతినిధులు హాజరై ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపసర్పంచులు ఏకగ్రీవంగా మండల ఫోరం కమిటీని ఎన్నుకున్నారు. మండల ఫోరం అధ్యక్షులుగా మీర్ ఇమ్రాన్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వెంక గౌడ్, జనరల్ సెక్రటరీగా మహేష్, కోశాధికారిగా వెంకట్, సలహాదారులుగా షామయ్య, బలరాం నియమితులయ్యారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మండల పరిధిలోని గ్రామాల సమగ్ర అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, అలాగే సర్పంచులు–ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల సమన్వయంతో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలతో రాజంపేట మండలంలో గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
