మేడ్చల్

సమాజనికి సాయం చేసినోళ్లే గొప్పోళ్ళు

Submitted by sridhar on Wed, 07/09/2022 - 19:22
  • షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ 
  • పెంజర్లలో నిరుపేద కిష్టయ్యకు రెండు ఎడ్లు అందజేత 
  • జర్నలిస్ట్ మధు సుధన్ గౌడ్" కృషితో దాతల ఆర్థిక సహకారం 
  • కార్యక్రమానికి హాజరైన జడ్పిటిసిలు, నాయకులు, జర్నలిస్టులు తదితరులు.. 

సమాజానికి సాయం చేసినోళ్లే గొప్ప వాళ్ళని, జర్నలిస్టులు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ మామిడి వసుంధరమ్మ ఆమె కుమారుడు మామిడి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నిరుపేద కూలి కిష్టయ్యకు రూ 95 వేల విలువైన రెండు ఎడ్లను  అందజేశారు.

బస్తీ దవాఖానను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

Submitted by Sandeepreddy b… on Wed, 07/09/2022 - 19:12
  • కార్యక్రమంలో పాల్గొన్న పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి

మేడిపల్లి  సెప్టెంబర్7 ప్రజాజ్యోతి ; పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ లో, 4వ డివిజన్ లక్ష్మి నగర్ కాలనీ లో  ఏర్పాటు చేసిన  బస్తీ దవాఖాన నూతన భవనాలను తెలంగాణ రాష్ట్ర కార్మిక మంత్రి   చామకూర మల్లారెడ్డి  ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణాల్లో బస్తీ దవాఖానాలు  ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

సుజిత్ రావు క్రికెట్ లీగ్ లో విజేతలు గా నిలిచిన కోరుట్ల ఎల్ సి సి జట్టు.

Submitted by Mdrafiq on Sat, 03/09/2022 - 15:56

◆కోరుట్ల జట్టును అభినందించిన కల్వకుంట్ల సుజిత్ రావు

మల్లాపూర్ సెప్టెంబర్ 03,ప్రజా జ్యోతి:మల్లాపూర్ మండలంలోని సంగెం శ్రీరాంపూర్ గ్రామంలో కల్వకుంట్ల సుజిత్ రావు క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. కోరుట్ల పట్టణానికి చెందిన (ఎల్ సి సి) జట్టు అలాగే మెట్ పల్లి పట్టణానికి చెందిన (ఎంసీఏ) జట్టులు తలపడ్డాయి. దీనిలో భాగంగా కోరుట్ల ఎల్ సి సి విజేతలుగా నిలువగా మెట్పల్లి ఎంసీఏ జట్టు రన్నర్లుగా నిలిచారు.