జైనూర్

ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు ఇస్కానింగ్

Submitted by veerareddy on Mon, 26/09/2022 - 13:44


జైనూర్ సెప్టెంబర్ 25:(ప్రజా జ్యోతి): జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు ఆల్ట్రా స్కానర్ చేయించడం జరిగిందని డాక్టర్ నాగేంద్ర అన్నారు. ఆదివారం రోజున సిర్పూర్ యు మండలానికి చెందిన 55 మంది గర్భిణీ స్త్రీలకు జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలలో అల్ట్రా సౌండ్ స్కానింగ్  చేయించి వాళ్లకు మెరుగైన వైద్యం అందించడం జరిగిందన్నారు. గర్భిణి స్త్రీలు ప్రతి నెలకు వచ్చి స్కానింగ్ చేయించుకోవాలని కోరారు. డాక్టర్ విక్రమ్ రేడియోలజిస్ట్ స్కానింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు డాక్టర్లు తదితరులున్నారు

టీయూడబ్ల్యూజే జిల్లా మహా సభ లను విజయవంతం చేయండి

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:49

జైనూర్ సెప్టెంబర్ 24:( ప్రజా జ్యోతి):  ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 28న నిర్వహిస్తున్న టీయూడబ్ల్యూజే ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే ప్రతినిధులు  కాంబ్లే అన్నారావు  పోలిపల్లి నరేందర్ కార్యవర్గ సభ్యులు రామేశ్వర పిలుపునిచ్చారు. శనివారం జైనూరు మండల కేంద్రంలో జిల్లా మహాసభల  పోస్టర్లు కరపత్రాలను విడుదల చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:47

జైనూర్ సెప్టెంబర్ 24:(ప్రజా జ్యోతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారని ప్రిన్సిపల్ శ్రీదేవి అన్నారు. శనివారం రోజున జైనుర్ మండల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతి ఎన్ఎస్ఎస్ అధ్వారంలో  విద్యార్థులకు సామూహిక కార్యక్రమంలో నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటరీలు బహుమతులు అందజేశారని అన్నారు.ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి వేడు అధ్యాపకులు ప్రిన్సిపాల్ శ్రీదేవి జిల్లా మద్యమీద అధికారులు శ్రీధర్ సుమన్ తదితరులున్నారు.

పౌష్టికాఆహారంతోనే బాలింతలు, గర్భిణీలకు ఆరోగ్యం

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:45

జైనూర్ సెప్టెంబర్ 24:( ప్రజా జ్యోతి):  పౌష్టికాహారం తోనే గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యంగా ఉంటుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ పెంటు బాయి అన్నారు. శనివారం మండలంలోని జామిని గ్రామపంచాయతీలో పోషణ,పౌష్టికాహారం కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమానికి భుసి మెట్ట, రాసి మెట్ట, జామిని గ్రామ ల గర్భిణీ, బాలింత లకు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అనంతరం 10 (పదిమంది) గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగిందన్నారు.

ఉపాధ్యాయుడు కు ఘనంగా సన్మానం

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:41

జైనూర్ సెప్టెంబర్ 24:(ప్రజా జ్యోతి): జామిని గ్రామపంచాయతీలో సర్పంచ్ ఉపాధ్యాయులకు ఎంపియుపిఎస్ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న వెట్టి జాకు ఉపాధ్యాయులకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారని సర్పంచ్ రాహుల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జామిని గ్రామపంచాయతీలో ఎంపీ యుపిఎస్ పాఠశాలలో హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న వెట్టి జకు ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో గణిత శాస్త్రం విభాగంలో బెస్ట్ టీచర్ గా అవార్డు వచ్చిందన్నారు. బెస్ట్ టీచర్ అవార్డు రావడం వల్ల మాకు ఎంతో గర్వకరంగా ఉందన్నారు. ఇలాగే మా పిల్లలకు నాణ్యమైన విద్యానందించి మరి ఎన్నో అవార్డు ఉండాలని సూచించారు.

నిర్లక్ష్యపు నీడలో జైనుర్ ప్రభుత్వ ఉర్దూ పాఠశాల

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:37
  • 300 మంది విద్యార్థులు... ముగ్గురే ఉపాధ్యాయులు..
  • -కానరాని బయోమెట్రిక్ యంత్రం
  • -ఉన్న కంప్యూటర్లు మాయం
  • -నేటికీ అందని పాఠ్యపుస్తకాలు
  • -అస్తవ్యస్తంగా పాఠశాల నిర్వహణ
  • -ఆందోళనలో విద్యార్థులు
  • -పట్టించుకోనని అధికారులు

జైనూర్ సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి) ..///... జైనూరు మండల కేంద్రంలో ఉన్న ఉర్దూ ప్రభుత్వ పాఠశాల పాలకులు, అధికారుల నిర్లక్ష్యపు నీడలో కొన సాగుతుంది.