తుంగతుర్తి

కారును వెనుక నుండి ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం... యువకుడి మృతి

Submitted by Yellaia kondag… on Fri, 30/09/2022 - 10:41

తుంగతుర్తి, సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి)./..ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ముందు పోతున్న కారును వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందడంతో పాటు మరొక వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై డానియల్ తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మండలం సిద్ధి సముద్రం తండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్( 18 ) తన బావ బానోతు సుమన్ తో కలిసి తుంగతుర్తి మండలం  ఏనేకుంట తండాకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

కుంటపల్లి సర్పంచ్ ని పరామర్శించిన నల్లు రామచంద్రారెడ్డి

Submitted by Yellaia kondag… on Thu, 29/09/2022 - 16:50

తుంగతుర్తి, సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి); మద్దిరాల మండల పరిధిలోని కుంటపల్లి గ్రామ సర్పంచ్,మండల సర్పంచుల పోరం అధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి అమృతా రెడ్డి గురువారం  అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తుంగతుర్తి సర్పంచుల ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్ర రెడ్డి  అమృతా రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి జిల్లా రైతుబంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ ఏ రజాక్ తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డిని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తుంగతుర్తి లో విషాదం.. పిడుగుపడి గొర్ల కాపరి మృతి

Submitted by Yellaia kondag… on Thu, 29/09/2022 - 12:32

తుంగతుర్తి, సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి); గొర్లను మేపడానికి వెళ్లిన ఓ వ్యక్తితో పాటు మూడు మేకలు పిడుగుపాటుకు గురై మృతి చెందిన సంఘటన తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన వీరబోయిన నాగరాజు (30)తండ్రి బిక్షం  తో కలిసి బాలికల గిరిజన గురుకుల పాఠశాల వెనకాల  గొర్లను మేపుతుండగా సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండడంతో పక్కనే ఉన్న చెట్టు కిందికి వెళ్లగా ఆ సమయంలో పిడుగు పడి నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో నాగరాజుకు చెందిన మూడు మేకలు కూడా మృత్యువాత పడ్డాయి.

డీసీఎంఎస్ చైర్మన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిఆర్ఎస్ కే వి నాయకులు

Submitted by Yellaia kondag… on Thu, 29/09/2022 - 11:44

తుంగతుర్తి, సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి);  ఉమ్మడి నల్లగొండ జిల్లా  డీసీఎంఎస్  చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ కి తెరాస కార్మిక విభాగం తుంగతుర్తి నియోజకవర్గం అధ్యక్షుడు గౌడ్ చర్ల సత్యనారాయణ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.బుధవారం  ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వట్టే జానయ్య యాదవ్ సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఉండాల‌ని, ప్రజా సేవ చేయాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి డిసిసిబి బ్యాంక్ మేనేజర్ నారబోయిన యాదగిరి,టిఆర్ఎస్ కే వి నాయకులు తానాజీ, తూము వెంకటేష్, ఉప్పునూతల కోటేష్ తదితరులు  పాల్గొన్నారు.

తుంగతుర్తి పై చవతి తల్లి ప్రేమ చూపిస్తున్న ఎమ్మెల్యే మల్లెపాక సాయిబాబా

Submitted by Yellaia kondag… on Tue, 27/09/2022 - 16:07

తుంగతుర్తి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి):   నాడు ఎన్నికల ముందు తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నేడు తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ  నియోజకవర్గ కేంద్రమైనటువంటి తుంగతుర్తిపై  సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని బిజెపి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేపాక సాయిబాబు అన్నారు. మంగళవారం తుంగర్తి మండల కేంద్రంలోని సూర్యపేట తుంగతుర్తి ప్రధాన రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...