భద్రాచలం (ST)

పర్మినెంట్ ఎంఈఓని నియమించాలి. ఎంఎల్ ప్రజాపందా డిమాండ్

Submitted by Kancharla Nara… on Thu, 15/09/2022 - 13:35

చర్ల, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి: చర్ల మండలానికి పర్మినెంట్ ఎంఈఓ నియమించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్, పిడిఎస్యు విద్యార్థి సంఘం మండల కార్యదర్శి ముసలి సతీష్ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్ల మండలానికి పర్మినెంట్ ఎంఈఓని నియమించేంతవరకు దీక్ష విరమించేది లేదని తెలిపారు.

హరితహారం ఆబాసు పాలు

Submitted by Kancharla Nara… on Wed, 14/09/2022 - 14:36

చర్ల, సెప్టెంబర్ 14, ప్రజాజ్యోతి: చర్ల మండలం కేశవపురం గ్రామపంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ప్రజలకు పాలన చేరువ చేయాలనే దృఢ సంకల్పంతో ఎంతో ముందు చూపుతో చిన్న చిన్న గ్రామపంచాయతీలుగా విడగొట్టడం జరిగింది. కానీ కొన్ని గ్రామపంచాయతీలోని సర్పంచులు కార్యదర్శులు ప్రభుత్వ ఆలోచనను తుంగలో తొక్కి వారి ఇష్టానుసారంగా పంచాయతీలలో అభివృద్ధి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. దీనికి నిదర్శనమే కేశవపురం గ్రామపంచాయతి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు మచ్చుకైనా కనిపించడం లేదు.

రఘు థియేటర్లో కనీస సౌకర్యాలు నిళ్లు

Submitted by Kancharla Nara… on Sun, 11/09/2022 - 20:18

చర్ల, సెప్టెంబర్ 11, ప్రజాజ్యోతి: చర్ల మండల కేంద్రంలోని రఘు థియేటర్ లో కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్ ప్రజాపందా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ రఘు థియేటర్లో కనీస సౌకర్యాలు లేనందున వీక్షకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సరిపడా బాత్రూంలు లేవని ఉన్న ఒక్క బాత్రూం అపరిశుభ్రంగా ఉందని, థియేటర్ పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని తగిన శుభ్రతా ప్రమాణాలు పాటించడం లేదని అన్నారు.

స్వచ్ఛ ఆశ్రమ పాఠశాల కార్యక్రమాలు పూర్తి - డి.డి రమాదేవి

Submitted by kranthikumar.dasari on Sun, 11/09/2022 - 18:11

భద్రాచలం, సెప్టెంబర్11 ప్రజాజ్యోతి:- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో మరియు వసతి గృహాలలో ఈనెల 6 నుండి 11వ తేదీ వరకు నిర్వహించిన స్వచ్ఛ ఆశ్రమ పాఠశాల కార్యక్రమాలు ,అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి అన్నారు.

భద్రాచలం దేవస్థానంలో దసరా ఉత్సవాల తేదీలు ఖరారు

Submitted by kranthikumar.dasari on Sun, 11/09/2022 - 17:47

భద్రాచలం, సెప్టెంబరు11 ప్రజాజ్యోతి:- భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవ స్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు శరన్నవ రాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు . 5న విజయదశమి సందర్భంగా సంక్షేప రామాయణ హోమం , పూర్ణాహుతి , మహాపట్టాభిషేకం నిర్వహించ నున్నారు . దసరా మండపంలో విజయోత్సవం , శమీ , ఆయుధపూజలు , శ్రీరామలీలా మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

 

26 నుంచి అమ్మవారి అలంకారాలు