వేముల వాడ

మురళీ సేవలు చిరస్మరణీయం

Submitted by Mdrafiq on Sun, 04/09/2022 - 17:07

వేములవాడ, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : వేములవాడ వాసవి సత్రం అధ్యక్షుడు ఏగిన మురళీ అందించిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. వాసవి సత్రం అధ్యక్షుడు ఏగిన మురళీ సంస్మరణ సభ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సత్రం కోసం ఏగిన మురళి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎంతోమందికి సేవ చేసిన వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమని వారన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు

Submitted by Mdrafiq on Sun, 04/09/2022 - 13:40

వేములవాడ, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామానికి చెందిన కాసారపు వజ్రవ్వ అను మహిళ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని వేములవాడ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మంద శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఆమె మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.