
ఖమ్మం, జనవరి 02, ప్రజాజ్యోతి : ప్రజాజ్యోతి ఖమ్మం జిల్లా కార్యాలయాన్ని సోమవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రజాజ్యోతి దినపత్రిక సీఈవో మారుతి బిక్ష్మా రెడ్డిలు ముఖ్య అతిథిలుగా పాల్గొని కార్యాలయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాజ్యోతి దినపత్రిక కార్యాలయం నూతన సంవత్సరంలో ప్రారంభించడం శుభ సూచకమని ముందు ముందు ప్రజాజ్యోతి ప్రజా సమస్యలపై అలపెరుగని పోరాటం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, 44 వ కార్పొరేటర్ పాలేపు విజయ,బీఎస్పి జిల్లా అధ్యక్షులు అల్లిక వెంకటేశ్వర్లు,ట్రాఫిక్ సిఐ అంజలి, ప్రజాజ్యోతి జిల్లా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- 252 views