ఘనంగా ప్రజా నాయకుడు పొంగులేటి జన్మదిన వేడుక

Submitted by veerabhadram on Fri, 28/10/2022 - 17:07
dayponguleti birth

చండ్రుగొండ, ప్రజా జ్యోతి   అక్టోబర్ 28

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
 (శ్రీనన్న) జన్మదిన సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని రావికంపాడు గ్రామంలో గానుగపాడు సొసైటీ వైస్ చైర్ పర్సన్ భూపతి ధనలక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మొక్కలు నాటి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనసున్న మహానేతగా ప్రజల మధ్యలో శీనన్న చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. శీనన్న జన్మదినం వాడవాడలా పండగ వాతావరణం సంతరించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ రన్యానాయక్, బి.ఆర్.ఎస్ మండల ఉపాధ్యక్షులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ.సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు, టి.ఆర్.ఎస్ పార్టీ ఉద్యమకారులు ఎస్కే అబ్బాస్ అలీ, మండల ఎస్టీ సెల్ నాయకులు  బానోత్ రామోజీ నాయక్, తేజావత్ సతీష్ నాయక్, భూపతి చందర్రావు,  ఉప్పనూతల మల్లయ్య, బంజార సంఘం నాయకులు ఇస్లావత్ గన్య నాయక్, పెండ్యాల ముత్తయ్య, బానోత్ బద్రునాయక్, పేరూరి  వెంకటరావు, యూత్ నాయకులు గుగులోత్ సుమన్, బానోత్ సతీష్ నాయక్, గుగులోత్ ఆజ్యా నాయక్, బాదావత్ అశోక్ నాయక్, మాలోత్ గణేష్ నాయక్, బానోత్ చిన్న బద్రు నాయక్, బానోత్ నరేష్ నాయక్, భూక్య గణేష్ నాయక్, పెండ్యాల దుర్గయ్య, మాలోతు రమానాయక్ లు పాల్గొన్నారు.