పోడు భూములకు పట్టాలు ఇవ్వడం సంతోషకరం:దిండిగాల

Submitted by bathula radhakrishna on Thu, 13/10/2022 - 17:44
Yellandu

పొడుభూములకు పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ  విడుదల విడుదల చేయడం సంతోషకరమని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని బొజ్జయిగూడెం పంచాయతీ కొల్లాపురం గ్రామ శివారులో రెవెన్యూ, ఫారెస్ట్,గ్రామ సచివాలయ సిబ్బంది సర్వే బృందం పనితీరును పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్,ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచన మేరకు సర్వే జరుగుతున్న తీరును పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు.రైతులు,సర్వే అధికారులు పరస్పరం సహకరించుకుంటూ సర్వే పనులు నిర్వహించాలని సూచించారు.పోడు భూములకు పట్టాలు మంజూరు చేసినందుకు ముందుకు వచ్చిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలిపారు. రైతులు,అధికారులకు పరిస్పర సహకారంతో సర్వే పనులు గడువులోగా పూర్తి చేయాలని కోరారు. కొత్తగా పోడు నరుకుట నిషేదించి భావి తరాలకు సమతుల్య వాతావరణం అందించేందుకు అందరూ నడుంబిగించాలన్నారు.ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి నాయకులు పులిగళ్ల మాధవరావు, పిఏసిఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ,ఆత్మ కమిటీ చైర్మన్ భావు సింగ్ నాయక్,సర్పంచ్ చీమల వెంకటేశ్వర్లు,సోషల్ మీడియా ఇంచార్జ్ యంటెక్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags