ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు

Submitted by BikshaReddy on Sun, 18/09/2022 - 17:01
adilabad

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరచుకొని,ఉగ్రవాద కార్యకలాపాల పై శిక్షణ ఇస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎన్ఐఎ అధికారులు పలుచోట్ల దాడులు నిర్వహించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మదీనా కాలనీలో తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఎ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మహమ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ మొబిన్,అనే ఇద్దరినీ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా వీరి నుంచి అందిన సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫిరోజ్ అనే మరో అనుమానిత వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తలదాచుకున్నట్లు గుర్తించిన ఎన్ఐఎ అధికారులు ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ కాలనీలోని అబూ బాకర్  మజీద్ సమీపంలో ఉన్న దంగల్ గల్లీలో అకస్మాత్తుగా  దాడులు నిర్వహించి పలు ఇళ్లను సోదాలు చేశారు. అబూబకర్ మజీద్ సమీపంలో ఒక ఇంట్లో తలదాచుకున్న ఫిరోజ్ అనే అనుమానిత  వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈయనతో పాటు మరికొందరికి సంబంధాలు ఉన్న మరో ఇద్దరి కోసం ఎన్ఐఎ అధికారులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలులో  శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దరిని కొర్టు అనుమతితో విచారణ జరిపారు. దీంతో ఒక్కసారిగా ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఎన్ఐఏ సోదాల వల్ల ఉగ్రవాదుల మూలాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా సోధాలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉగ్రవాదుల మూలాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత రెండు నెలల క్రితం బీహార్ లో  కొందరు అనుమానితుల వద్ద పట్టుబడ్డ మందు గుండు సామాగ్రిని  ఆదిలాబాద్ కు చేరవేస్తున్నట్లు చెప్పడం తో  అప్పటినుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై పోలీసు నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టిని సారించాయి. ఈ నేపథ్యంలో పట్టుబడ్డ ఉగ్రవాదుల హనుమానితుల నుంచి ఎన్ ఐఎ అధికారులు పలు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాపై నిఘవర్గాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకొని వారి కార్య కలాపాలను చాప కింద నీరులా కొనసాగిస్తూనే శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారనే సమాచారం సేకరించిన ఎన్ఐఎ అధికారులు ఉదయం నుంచి పలుచోట్ల దాడులు నిర్వహించి తనిఖీలు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా సోధాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లా కేంద్రాలలో వివాదాస్పద ప్రాంతాలలో  ప్రత్యేక జిమ్, కరాటే, కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో యువకులకు ప్రత్యేక శిక్షణ లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ఐఎ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Tags