కెసిఆర్ వ్యాఖ్యల పై భగ్గుమన్న ఆదివాసీ గిరిజనులు సి ఎం దిష్టిబొమ్మ దహనం

Submitted by BikshaReddy on Sun, 18/09/2022 - 17:11
aware

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 18, (ప్రజా జ్యోతి)

 ఆదివాసీ గిరిజనులు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మ ను దహనం చేశారు. కేసీఆర్ పై ఆదివాసీ గిరిజనులు బగ్గు మన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొమురం భీం ఆదివాసి భవన్, సేవాలాల్ బంజారా భవన్ ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడిన మాటలు దేశంలో ఉన్న లంబాడీలను ఒకే గూటికి చేర్పించి, 10 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తాం అన్న మాటలను నిర్వహిస్తూ సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదివారం ఉట్నూర్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. కొమురం భీం కాంప్లెక్స్ వద్ద రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం 10 శాతం పెంచుతామని ప్రకటించ డం వల్ల ఆదివాసులకు ఒరిగేది ఏమీ లేదని, ఉన్న రిజర్వేషన్లు మొత్తం కూడా దోడ్డి దారిన మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఆదివాసులకు చెందాల్సిన రిజర్వేషన్ లను కోల్లగోడుతూ దోచుకొని తింటున్న వారికి మళ్లీ  వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నిస్తూ ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస లంబాడీల ను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించిన తర్వాత నే రిజర్వేషన్ లను పెంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్, రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపూరావు, మహిళా నాయకురాలు పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

Tags