దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ

Submitted by bathula radhakrishna on Mon, 10/10/2022 - 18:20
Yellandu

ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఇసిఐఎల్) సంస్థ సహకారంతో ఆలింలో సంస్థ,జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో ఈనెల 13న బిపియల్ కు చెందిన దివ్యాంగులు,విభిన్న ప్రతిభావంతులకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉపకరణాలు,సహాయపరికరాలను స్థానిక మార్కెట్ యార్డులో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఇల్లందు ఐసిడియస్ సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు.సోమవారం విలేకరులతో మాట్లాడుతూ శిబిరానికి హాజరై పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. చేతి కర్రలు,చంక కర్రలు,వీల్ చైర్లు,చెవి వినికిడి యంత్రాలు,  మూడు చక్రాల సైకిళ్ళు, రోలో టేర్స్,యంఎస్ఐఇడి కిట్,స్మాట్ కేన్,అంధుల చేతి కర్ర,ఎల్బో క్రచ్చేన్, బాగైన కుష్టు వ్యాధి గ్రస్థులకు లెప్రిసి కిట్,డైసీ ప్లేయర్,కృత్రిమ అవయవాలు మొదలగు ఉపకరణాలు,సహాయ పరికరాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.దారిద్రరేఖ పరిమితి లోబడిన ఆదాయం కలిగి ఉండాలని,వారి భౌతిక అవసరాలను బట్టి సహాయ ఉపకరణాల వినియోగం తప్పనిసరైన వారు,40 శాతం వికలాంగత్వం కలిగిన దివ్యాంగులు అర్హులన్నారు.శిబిరానికి సదరం వైద్య ధ్రువీకరణ పత్రం,రేషన్ కార్డు,ఆధార్ కార్డు,ఆదాయ ధ్రువీకరణ పత్రం,రెండు ఫోటోలు,దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఫోన్ నెంబర్ నమోదు చేయాలని తెలిపారు. అర్హత,అవసరం కలిగిన దివ్యాంగులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాల కొరకు 040-27891463,7675882422 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Tags