యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలి:డా: రాములు నాయక్.

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 10:49
Youth should opt for self-employment: Dr. Ramulu Naik.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 19(ప్రజా జ్యోతి)../ యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా: రాములు నాయక్ అన్నారు.సోమవారం ఆయన దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఐ కేర్ క్లినిక్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు కంటి వైద్యం కోసం దూర ప్రాంతం వెళ్లకుండా పట్టణంలోనే కంటి పరీక్షలు చేయించుకునేందుకు ఐ కేర్ క్లినిక్ తోడ్పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహకుడు  ఎం.డి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.