అఫ్జల్ ఆశయాలను కొనసాగించాలి:కూనంనేని

Submitted by bathula radhakrishna on Thu, 23/03/2023 - 09:48
Yellandu 264


 21 పిట్ శాఖ మాజీ సిపిఐ,ఎఐటియుసి నాయకులు అఫ్జల్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.గురువారం స్థానిక బొల్లినగర్ లో ఏర్పాటు చేసిన అఫ్జల్ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం వామపక్ష, ప్రగతిశీల,లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఏకంకావాలన్నారు.అఫ్జల్ సిపిఐ ఎఐటియుసి బలోపేతానికి,ఈ ప్రాంతంలో విశేష కృషి చేశాడని,సింగరేణి కార్మికుడిగా తన ఉధ్యోగ దర్మాన్ని నిర్వహిస్తూ వర్కర్స్ యూనియన్ కార్యక్రమాలను తన తొటి కార్మికులకు చేరవేయడంలో చురకైన పాత్రపొషించేవాడని కొనియాడారు.అఫ్జల్ కుటుంబం పార్టీకి అనేక సేవలు అందించారని తెలిపారు.అఫ్జల్ స్థూపాన్ని మండల పార్టీ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకపోవాలని, భౌతికంగా మన మద్య లేకపొయిన వారు చూపిన మార్గంలో నడిచిననాడే వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళులని అన్నారు. నేడు కేంద్రంలోని మోడీ పాలన నాటి బ్రిటిష్ తెల్లదొరల,రాజాకార్ల పాలనను తలపిస్తుందని, చట్టసభల్లో ఉన్న మందబలంతో రైతు, కార్మిక,ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువస్తు నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ప్రజలు నిర్మించుకున్న 400కు పైగా ప్రభుత్వ సంస్థలను ఆదాని,అంబానీలాంటి కుభేరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.మోడి తీరుతొ దేశ సమక్యత, సమగ్రతలకు ప్రమాదం ఏర్పడిందని ప్రమాదకర పాసిస్టు నిరంకుశ,హిట్లర్ తరహ పాలనను కొనసాగిస్తున్న పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం వామపక్ష, ప్రగతిశీల,లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఏకంకావాలని పిలుపు ఇచ్చారు.జెకె ఓసి విస్తరణలో ప్రాంతంలో సుమారు 3200 మంది నివాసం ఉంటున్నారని, వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని,ఓసి ప్రైవేటీకరణ నిలిపివేయాలని, సింగరేణి పనులు నిర్వహించాలని,ఖాళీగాఉన్న క్వార్టర్స్ ను విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాభిర్ పాషా మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర వేగంగా అడుగులు వేస్తూ ఉద్యోగులను, కార్మికులను రోడ్డుపాలు చేసే చర్యలకు సిద్ధమవుతుందన్నారు. రాష్ట్రాల విభజన చట్టంలో హమి మేరకు బయ్యారం ఉక్కు పరిశ్రమ,కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోమని కేంద్ర తేల్చి చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని వారు దుయ్యబట్టారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమీషన్ సభ్యులు మిరియాల రంగయ్య,రాష్ట్ర సమితి సబ్యులు కె.సారయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి బ్రహ్మం, జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, టిజెఎస్ రాష్ట్ర సమితి సభ్యులు గుగులోత్ కృష్ణ, సిపిఐ మండల కార్యదర్శి ఉడుత ఐలయ్య,23వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి రవీందర్,బ్రాంచి ఉపాద్యక్షులు ఎస్.వి.రమణ,సహయ కార్యదర్శులు దాసరి రాజారామ్,సాయిరి రాజేశ్వరరావు, ఎఐటియుసి డివిజన్ కార్యదర్శి యండి.నజీర్ అహ్మద్,ఫిట్ కార్యదర్శులు కొడెం సుందర్,సంజీవ చారి,శంషుద్దిన్,మంచాల వెంకటేశ్వర్లు,వడ్ల శ్రీనివాస్,బొప్పిశెట్టి సత్యనారాయణ,బంటు యాదగిరి,భాస్కర్,రాఘవేంద్రరావు,జంగంపల్లి మోజెస్,వలి,రవి,గడదాసు నాగేశ్వరరావు,దేవరాజ్,శ్రీలక్ష్మి,బైరవేని సదానందం,కలవల రాజారామ్,బొల్లి కొమరయ్య,జొగారావు,అఫ్జల్ కుటుంబ సభ్యులు ఇమ్రాన్,హసన్,సర్వర్  తదితరులు పాల్గొన్నారు.

Tags