ఆత్మహత్య చేసుకున్న విఆర్ఏ కుటుంబాన్ని పరామర్శించిన ఖమ్మం జిల్లా విఆర్ఏ జేఏసి.

Submitted by Praneeth Kumar on Sun, 11/09/2022 - 18:18
VRAs visited the family of the VRA who committed suicide.

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 11, ప్రజాజ్యోతి.

రాష్ట్ర విఆర్ఏ జెఏసి పిలుపు మేరకు, సెప్టెంబర్ 13న ఛలో అసెంబ్లీ కి రాష్ట్ర నలుమూలల నుండి భారీగా విఆర్ఏ లు తరలి రావాలని కోరిన జెఏసి చైర్మన్ చల్లా లింగరాజు. సిఎం కేసీఆర్ విఆర్ఏ లకు ప్రకటించిన పేస్కేల్, పదోన్నతలు, వారసత్వ ఉద్యోగాలు ఇస్తానన్న హామీలు అమలు కాకపోవడంతో మనస్థాపంతో కంచర్ల వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆదివారం ఖమ్మం జిల్లా విఆర్ఏ లు మిర్యాలగూడెం వెళ్లి పరామర్శించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు. ఇట్టి ఆత్మహత్యకు కెసిఆర్ ప్రభుత్వం భాద్యత వహించి వారి కుటుంబంనకు ఎక్సగ్రెసియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బంగారు తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోకుండా వెంటనే విఆర్ఏ లకు చట్టసభల సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు జీవోని విడుదల చేసి అమలు చేసి వారి జీవితాలలో వెలుగులు నింపాలని చైర్మన్ చల్లా లింగరాజు కోరారు. అలాగే ఖమ్మం జిల్లా విఆర్ఏ జెఏసి నుండి ఆర్థిక సహాయం అధించారు. అలాగే వారి కుటుంబంకి ఉద్యోగం ఇప్పించటంలో పూర్తి భాద్యత తీసుకుంటుంది అని భరోసా ఇచ్చారు. విఆర్ఏ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో జిల్లా చైర్మన్ లింగరాజు, జిల్లా ట్రేజరీ ఉపేందర్, రూరల్ మండల అధ్యక్షులు చందుమియా, వీరయ్య, అజయ్, మురళి, ఇబ్రహీం, నాగరాజు, ముత్తయ్య, రామారావు, గోపి, నరేష్, వెంకట్ కృష్ణ, సంపత్, జ్యోతి బాసు తదితరులు పాల్గొన్నారు.