పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:04
Two women were killed and three others were seriously injured due to lightning

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

కల్వకుర్తి సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి.///.. వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ ఈదమ్మ బండ తండాకు చెందిన నేనావత్ నాన్కు (50) నేనావత్ రుక్మిణి ( 25) లు పిడుగుపాటుకు బుధవారం గురై మృతి చెందారు.  వివరాల్లోకి వెళితే ఈదమ్మ బండ తండా సమీపంలోని గుట్టల ప్రాంతం వద్ద నేనవత్ నాన్కురుక్మిణి,వైశాలి,కళ,రూప్లా లు పశువులు కాస్తుండగా మధ్యాహ్న ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.వర్షానికి సమీపంలోని చెట్టు కిందికి చేరుకున్నారు.ఉరుముల మెరుపుల కారణంగా ఒక్కసారిగా పిడుగు పడి నాన్కు,రుక్మిణీ,వైశాలికళ,రూప్లా లు పస్మారక స్థితికి చేరుకున్నారు చేరుకున్నారు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వీరిని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షయగాత్రులను సందర్శించి వారి మృతి పట్ల తీవ్ర దిగ్బంధం వ్యక్తం చేశారు బాధితులకు తక్షణమే మెరుగైన  చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులకు సూచించారు. వారి వెంట  సర్పంచ్ భూపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్, నాయకులు ఉన్నారు