గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే తెరాస ప్రభుత్వ ధ్యేయం: మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by Sathish Kammampati on Wed, 07/09/2022 - 12:06
Terasa Govt's mission to create infrastructure in villages: Manchikanti Venkateshwarlu.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 06(ప్రజా జ్యోతి)  గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే తెరాస రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నల్గొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని చింతగూడెం గ్రామపంచాయతీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్దే ధ్యేయంగా  ప్రతి గ్రామపంచాయతీలో హరితహారం మొక్కలు,వైకుంఠధామాలు,ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్,సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొదలైన అభివృద్ధి పనులతో గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పాల్వాయి కరుణ శ్రీనయ్య,తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు పేర్ల జైపాల్ రెడ్డి, అమరవాది ఇస్తారి,బిక్షం గౌడ్,గిరి, సతీష్,హరిత,సన్నాయిల వెంకటయ్య,సతీష్,బాలయ్య,మంజుల,ఏడుకొండలు,సైదులు తదితరులు పాల్గొన్నారు.