*కుల, మతాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది మంత్రి జగదీశ్వర్ రెడ్డి

Submitted by mallesh on Wed, 21/09/2022 - 12:13
* Telangana will develop beyond caste and religion Minister Jagadishwar Reddy

చౌటుప్పల్ సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి)../  ప్రపంచం అద్భురపడే విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడనిరాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మార్కెట్ చైర్మన్  బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల, మున్సిపల్ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, ముత్యాల ప్రభాకర్ రెడ్డి తదితరులు మంత్రి జగదీశ్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి  గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కుటుంభ సభ్యులం అందరం కలవడం , చాలా సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్టానికి తండ్రిలాగా ఆదరిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ ప్రేమ, అనురాగాలు, మానవత్వంతో ప్రజలకు సేవ చేస్తున్నదన్నారు.తెలంగాణ సొంత రాష్ట్రం  ఏర్పాటు అయితే తప్ప కష్టాలు  తీరవని భావించిన కేసీఆర్  2001లో జెండా పట్టి పోరాటం ప్రారంభించారని, చివరకు చావు నోట్లో తల పెట్టి స్వరాష్ట్రంను సాధించారని, సాధించిన తెలంగాణలో సబ్బండ వర్గాల మనసును తట్టి, సమస్యలను తెలుసుకున్న వ్యక్తి గా సీఎం గా కేసీఆర్ ప్రపంచం అబ్బుర పడేలా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, తెలంగాణాను సీఎం కేసీఆర్  దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్గత 8 ఏళ్ల పాలనలో తెలంగాణలో  ఆకలిని పారద్రోలారని,మునుగోడు లో ఫ్లోరైడ్ బూతాన్ని   అంతం చేశారని, తెలంగాణ రాష్ట్రంలో  రైతులు అప్పు చేయకుండా ఆర్ధికంగా పరిపుష్టం కావాలని  కృషి చేస్తున్న గొప్ప దార్శనికుడు సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని, అంబేద్కర్ ఆశయాలతో తెలంగాణ ముందుకు పోతున్నదని, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా పాలన చేస్తున్నారని, అట్టడుగు వర్గాల అభ్యుదయం కోసం కృషి చేస్తున్నారని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలలో ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు.

దేశ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ను  కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ పిలుపునిచ్చిన టిఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా  పాటించాలన్నారు. గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు, బిజెపి పాలనలను చూసామని, ఎవరు కూడా ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ముందుకు వెళ్తుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నల్లబోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, రాష్ట్ర ఆయిల్ పేడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, టిఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కప్పల శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్ తోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ కమిటీలతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.