భూగర్భ జలాలు పెంచేందుకు పటిష్ట చర్యలు. కేంద్ర జలశక్తి అభియాన్ సభ్యులు సంజయ్ కుమార్.

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:21
Strong measures to raise ground water. Sanjay Kumar is a member of Kendra Jalashakti Abhiyan

 భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్ 23 ప్రజాజ్యోతి.//.భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న  జలశక్తి అభియాన్ కార్యక్రమంను, క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ పకడ్బందీగా నిర్వహించాలని జల శక్తి అభియాన్ కేంద్ర సభ్యులు. సంజయ్ కుమార్ అడిషనల్ సెక్రటరీ ఆఫ్ నేషనల్ లైవ్లీ హుడ్ అర్బన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ ఎఫైర్స్ పేర్కొన్నారు. శుక్రవారం  కలెక్టరేట్ సమావేశం మందిరంలో జలశక్తి అభియాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ,  రవి టెక్నికల్ ఆఫీసర్ సెంట్రల్ వాటర్ కమిషన్ బారిక్ ,  జిల్లా అధికారు లతో   సమీక్ష సమావేశం నిర్వహించారు.క్యాచ్ థ రైన్  వెన్ ఇట్ ఫాల్స్ అంశం పై కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తీసుకోవాల్సిన చర్యల పై సమావేశంలో చర్చించారు . జిల్లాలో ఉన్న నీటి వనరుల ట్యాంకుల సరిహద్దులో ఎలాంటి ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.  గ్రామాలలో సామూహిక ఇంకుడు గుంతలు నిర్మాణం, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణం, అటవీ పునరుద్ధరణ వంటివి చేపట్టాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో   జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి జలశక్తి అభియాన్ క్యాచ్ థ రైన్ క్యాంపెయిన్ చేపట్టామని అన్నారు.  గత 6 సంవత్సరాల కాలంలో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతుందని, జిల్లాలో కురుస్తున్న వర్షపు నీరు వృధా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 1045 చెరువులు ఉన్నాయని, వీటిలో 11 టిఎంసి ల నీటి సామర్థ్యం నిల్వ ఉంటుందని, 9 చెక్ డ్యాం పనులు పూర్తి చేసామని, 5 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

  వర్షపు నీరు వృధా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలలో అవగాహన పెంచుతున్నామని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విక్రమాల అమలు చేస్తున్నామని తెలిపారు. వీటిలో భాగంగా చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ చర్యలు, వాటర్ షెడ్ల అభివృద్ధి, అడవుల పెంపకం, నీటి మేనేజ్మెంట్ చర్యలు విస్తృతంగా చేపట్టామని అన్నారు. మహిళా సంఘాలు, అతను భాగస్వామ్యం చేస్తున్నామని, గ్రామసభల ద్వారా గ్రామాలలో నీటి సంరక్షణ పనులను గుర్తించామని పేర్కొన్నారు.ఉపాధి హామీ పనుల కింద జిల్లాలో ఇప్పటివరకు 54 చెరువులను అమృత్ సరోవర్ కింద పనులు పూర్తి చేశామని, శక్తి అభియాన్ కింద ప్రస్తుత సంవత్సరంలో రూ.19.42 కోట్లు ఖర్చు చేసి 2092 పనులు పూర్తి చేసామని, 591 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు .జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రతి మండలంలో 4 ఫార్మ పౌండ్లు, 55 పంచాయతీలలో 8550 గుంతలు, 21 అమృత సరోవర్ చెరువు పనులు, 184 చెరువు డిసిల్టింగ్ పనులు , మండలానికి 10 సామూహిక ఇంకుడు గుంత నిర్మాణ పనులు, 55 బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులు, 15 చెక్ డాం పనులు, రైడ్ టు వాలి కాన్సెప్ట్ (మల్హర్రావు, పాలిమేల) 2022-23 లో జలశక్తి అభియాన్ కింద చేపట్టామని అన్నారు.మిషన్ భగీరథ ద్వారా  424 ఆవాసాలలోనే 105042 ఇండ్లకు  623 ట్యాంకులు, 1509.36 కిలోమీటర్ల మేర అంతర్గత పైప్ లైన్ వేసి  ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర్, డీఎఫ్ఓ లావణ్య, డిఆర్ఓ కే రమాదేవి, డిఆర్డిఓలు, డిపిఓలు,  సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.