గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

Submitted by K.KARUNAKAR on Wed, 14/09/2022 - 16:50
State Government's efforts for the development of tribals


తొర్రూరు సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి) గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రోగ్రాం కోఆర్డినేటర్ ధరావత్ జై సింగ్ నాయక్,టిఆర్ఎస్ ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు జాటోత్ స్వామి నాయక్ తెలిపారు.బుధవారం డివిజన్ కేంద్రంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఎస్టీ సెల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఈనెల 17న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఆదివాసి, బంజారాల భవన ప్రారంభోత్సవం జరగనుందని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బంజారా భవన్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమానికి మండలంలోని గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని తెలిపారు.  తండాల్లోని కొత్త గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు.నడిచి కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న తండాలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, విద్యా వసతులు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు.గిరిజన యూనివర్సిటీ కోసం స్థలం కేటాయించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.

 గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్, ఆదివాసీల పోరాటయోధుడు కుమరం భీమ్ స్మారక భవనాలను సైతం సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. గిరిజనుల కోసం ఆలోచించిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు.గిరిజనుల అభివృద్ధి , సంక్షేమం టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమని స్పష్టం చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించడం లేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు  మాలోతు కాలు నాయక్,,బానోత్ కిషన్ నాయక్,గుగులోతు రమేష్ నాయక్,హపావత్ సురేష్ నాయక్,జాటోత్ విజయ్ కుమార్,సోమ్లా నాయక్,భోజ్యా నాయక్, లకావత్ యాకుబ్ నాయక్,జాటోత్ వెంకన్న నాయక్,రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.