బతుకమ్మ చీరల పంపిణీ చేసిన సర్పంచ్

Submitted by Yellaia kondag… on Tue, 27/09/2022 - 14:49
Sarpanch who distributed Bathukamma sarees

తుంగతుర్తి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి); తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్ చేతుల మీదుగా స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద  తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ప్రత్యేక గౌరవమే బతుకమ్మ చీర అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో మహిళలకు ఇబ్బందులు కలుగకుండా పంపిణీ చేయాలని కార్యదర్శికి, గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాష బోయిన వెంకన్న, ఎంపీటీసీ గుండ గాని వీరస్వామి, వార్డు సభ్యులు తునికి లక్ష్మమ్మ, తప్పెట్ల మల్లమ్మ సుధాకర్, పుల్లూరు అల్లమ్మ వీరస్వామి, కార్యదర్శి శ్రీధర్, గ్రామపంచాయ సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు.