సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం -- ఎమ్మెల్యే

Submitted by sridhar on Sat, 10/09/2022 - 16:54
Role of teachers is crucial in community development -- MLA

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 10 :ఘనంగా స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం వజ్రోత్సవాల వేడుకలుశనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎం ఏ ఎల్ డి డిగ్రీ  కళాశాల లో ఆడిటోరియం భవనంలో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం సంఘం 75 వసంతాల వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు.  ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  హాజరయ్యారు. 

ఎమ్మెల్యే  మాట్లాడుతూస్వాతంత్రం రాకముందు ఏర్పడిన యూటీఎస్ టీఎస్ శుభాకాంక్షలు గతంలో ఈ ప్రాంతం విద్యారంగంలో అత్యంత వెనుకబాటుకు గురయ్యాయి ఆవేదన వ్యక్తం చేశారు దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడ్డ గట్టు ప్రాంతం ప్రస్తుతం 17 శాతం నుంచి 40% విద్యాశాతం పెరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ లో విద్యావ్యవస్థ బలోపేతానికి సీఎం కేసిఆర్  తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు.  కోర్టు పరిధిలో ఉండటం వల్ల ఉపాధ్యాయుల సమస్యలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయని, త్వరలో ప్రమోషన్లు, బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని,  సమాజం అన్ని రంగాలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలంటే ఉపాధ్యాయుల పాత్ర కీలకమని  పేర్కొన్నారు.
పలువురు ఉపాద్యాయులు మాట్లాడుతూగద్వాల ఎమ్మెల్యే  విద్యారంగ సమస్యలపై చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పలువురు ఉపాద్యాయులు కొనియాడారు. అదేవిదంగా కేసిఆర్ స్టడీ సర్కిల్ ద్వారా యువతకు ఉచిత శిక్షణ, విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, నోటు పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతూ విద్యాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నరని తెలియజేశారు. 

పలు ఉపాధ్యాయులకు రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శాలువా కప్పి, మెమొంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు ఎమ్మెల్యే కి, చైర్మన్ కి శాలువా కప్పి, మెమొంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్, కౌన్సిలర్ దౌలు, స్టేట్ టీచర్స్ యూనియన్,    రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.