ఓడిఫ్ గ్రామంగా పెద్దపల్లి. ఏపీమ్ నిరంజన్

Submitted by sridhar on Sat, 10/09/2022 - 16:00
Peddapalli as Odif village. APIM Niranjan

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ )
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలఓ పెద్దపల్లి గ్రామపంచాయతీ గ్రామ సంఘం సమావేశానికి  ఏపీఎం నిరంజన్ హాజరై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి గ్రామ సంఘం సభ్యులకు వివరించారు.

పెద్దపల్లి గ్రామ సంఘాలు రెండు కూడా పెద్దపల్లి ని ఓడిఎఫ్ గ్రామంగా ప్రకటించారు.ఆదర్శ గ్రామం  అనగా బహిర్ భూమి కి వెళ్లకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఇంట్లో పది మొక్కలు పెంచుకోవడం 14 సంవత్సరాల బాలబాలికలు పనులకు వెళ్లకుండా అందరూ బడికే వెళ్లేటట్టు చేయడం 18 సంవత్సరాలు పైబడిన అమ్మాయిలకి పెళ్లి చేయాలి గృహింసలు జరగకూడదు మద్యపానాన్ని రూపుమాపాలి అంటరానితనాన్ని నిర్మూలించటం  కావున ఈ గ్రామంలో మొత్తము 34 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ప్రతి సభ్యురాలు సంఘంలో చేరాలి ప్రతి సభ్యురాలు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించాలి ప్రతి సంఘం పంచ సూత్రాలు పాటించాలని బ్యాంకు నుంచి స్త్రీ నిధి నుంచి మండల మహిళా సమాఖ్య  తెలకపల్లి నుంచి తీసుకున్న రుణాలను వివిధ జీవనోపాదుల కొరకు అభివృద్ధి మార్గంలో ఉపయోగించి,సభ్యురాలు యొక్క కుటుంబ జీవన స్థితిగతులు మార్పు చెందాలని అట్లాగే ఖర్చులు తగ్గించుకొని ఆదాయ మార్గాలు పెంచుకొని పేదరికంను రూపుమాపాలని తెలిపారు మరియు జాతీయ పోషణ్ అభియాన్ మాసంగా సెప్టెంబర్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ప్రతిజ్ఞ చేయిస్తూ ప్రతి కుటుంబం వారి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం పౌష్టికాహారంగా ఉండాలని ఆకుకూరలు పప్పు దినుసులు పాలు గుడ్లు తీసుకోవడం వలన కుటుంబాలు ఆరోగ్యవంతులుగా ఉండాలన్నదే లక్ష్యం కావున అందరూ పాటించాలని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా గ్రామాన్ని తీర్చిదిద్దాలని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని శుద్ధమైన నీటిని త్రాగాలని సర్వరోగ నివారిణిగా నివారిణిగా మసులుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు కవిత .భాగ్యమ్మ. ఇందిరమ్మ. పుష్ప .పద్మమ్మ. కళావతి. సరస్వతమ్మ. సువర్ణ .మైబమ్మ  నవత .సి సి  సుక్కునయ్య. వివో ఏలు మల్లేష్. రాము అంజలి. పాల్గొన్నారు.