గూడు లేని వారికే తెలుసు గుడిసే బాద.. -- అందరి జర్నలిస్టుల సంక్షేమం కోసమే పాదయాత్ర

Submitted by BikshaReddy on Fri, 23/09/2022 - 18:22
mahaboobnagar

 ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి... ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
-- జర్నలిస్టులు ఏకతాటి పైకి రావాలి...  స్వార్థం వీడాలి అందరి కోసం కలసి రావాలి ...!!
-- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మన హక్కు ..
-- సర్వే నంబర్ 25,523 లో ఇచ్చిన పట్టాలు తిరిగి  తీసుకొని ఇండ్లు ఇవ్వరా .?
-- కొందరు జర్నలిస్ట్  నాయకులు స్వార్థం కోసం చేస్తున్న ప్రలోభాలు  నమొద్దు..!!
-- ఎస్విఎస్ కాడ ఇండ్ల నిర్మాణం మళ్ళీ ఆగిపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు .?
-- ఎక్కడ పట్టాలు లేని జర్నలిస్ట్ ల పరిస్థితి ఏంది.? 
-- రాజకీయ నాయకులు విబజించి పాలించాలి అని చూస్తారు . !!! 
-- జర్నలిస్ట్ ల మధ్య చిచ్చు పెట్టవద్దు అని మనవి..!
-- ఉద్యమ చరితను ప్రపంచానికి చాటిన జర్నలిస్టులను మరవద్దు..
-- కలం వీరులు నడుం కట్టి కదలాలి. ...
-- వాకిట అశోక్ కుమార్ అధ్యక్షులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 
-- మేము అన్ని జర్నలిస్ట్ యూనియన్ లను గౌరవిస్తాం ..
-- మా యూనియన్ ను జర్నలిస్ట్ లను విమర్శిస్తే ఊరుకోం...!!!
-- అందరూ పాత్రికేయుల  ఇండ్ల సాదనే మా లక్ష్యం .
-- జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని స్థానిక శాసనసభ్యులు మంత్రి తో  చర్చించి అందరికీ ఇండ్లు ఇప్పించాలి.
-- 24వ తేదీ వరకు  ప్రకటిస్తే పాదయాత్ర విరమింపజేస్తాం..
--  రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బండి విజయ్ కుమార్. 

    తెలంగాణలో  జర్నలిస్టులు నివసించేందుకు గూడు కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ  అద్దె ఇండ్ల జీవనం కొనసాగిస్తున్నారనీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహబూబ్నగర్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి  తాత్సర్యం చేస్తున్నారని జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  ఇస్తామని ఇచ్చిన హామీనీ  వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.నాడు  తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిన  జర్నలిస్టులను,వారు చేసిన సేవలను మరువ వద్దన్నారు. జిల్లా విషయానికి వస్తె గతంలో కాంగ్రెస్ హయాంలో  డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు పట్టాలిస్తే నేడు టిఆర్ఎస్ హయాంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ  పట్టాలను  తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం  మరచారని గుర్తు చేశారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అందరు జర్నలిస్టులకు  అందాలని కోరారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు జర్నలిస్టుల హక్కు అని ఆయన గుర్తు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా లో ఉన్న అందరు జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలనీ కోరుతూ  ముఖ్యమంత్రి కి వినతి పత్రం ఇవ్వడానికే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పాదయాత్ర చేపట్టనుందని ఆయన తెలిపారు .అందరూ  జర్నలిస్టులు  స్వార్థం వీడి పాదయాత్రలో కలిసి రావాలని ఆయన కోరారు. కొందరు జర్నలిస్టు నాయకులు స్వార్థం కోసం చేస్తున్న ప్రలోభాలను  నమోవద్దని జర్నలిస్టులను కోరారు .25 వ సర్వే నెంబరు ఎస్వీఎస్ దగ్గర  మళ్లీ  ప్రారంభించిన డబల్ బెడ్ రూమ్ నిర్మాణాలు ఆగిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.  బాధ్యత ఎవరు తీసుకుంటారు లిఖితపూర్వకంగా తెలుపాలి అన్నారు. 523 సర్వేనెంబర్ లోని  క్రిస్టియన్ పల్లి లో పట్టాలు కోల్పోయి దివిటీ  పల్లి లో  ఇండ్లు రాని జర్నలిస్టుల పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. మరి ఎక్కడ పట్టాలు లేని జర్నలిస్టులు  ఉన్నారు కదా, మరి వారి పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు విభజించి పాలించేలా  చూస్తారని ఎవరి మాటలు నమ్మవద్దని ఆయన సూచించారు . జర్నలిస్టు ల  మధ్య రాజకీయంతో చిచ్చు పెట్టొద్దని ఆయన వేడుకున్నారు. ఇప్పటికైనా అందరూ ఒకే తాటిపైకి వస్తే
 సమస్య లు ఉండవని తెలిపారు . కలం వీరులు నడుం బిగించి పాదయాత్రలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ మేము అన్ని జర్నలిస్టు సంఘాలను గౌరవిస్తామని  . యూనియన్ల పరంగా అందరి విధి విధానాలు ఓకే లాగా ఉండవని, ఒక యూనియన్ లో ఉండి మిగతా యూనియన్లు కించపరచవద్దని ఆయన సూచించారు. అందరు జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయమని. మా యూనియన్ ను, జర్నలిస్టులను విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్  తీసుకున్న పాలమూరు నుండి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపడుతామని నిర్ణయం తర్వాతనే  పాలమూరులో చర్చలు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు.
  మేము ముఖ్యమంత్రి  అందరి జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని   ఇచ్చిన హామీని అడుగుతున్నామని నూతన కోరికలు ఏమి కోరడం లేదని ఆయన అన్నారు . ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని  మంత్రి తో  చర్చించి జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు. పట్టాలు వాపస్ తీసుకొనీ నిర్మాణం లో ఉన్న ఇండ్ల ప్రొసీడింగ్ లు వెంటనే  ఇవ్వాలని కోరారు. అదేవిధంగా క్రిస్టియన్ పల్లి 523 సర్వే నంబర్ లో పట్టాలు తిరిగి  తీసుకున్న జర్నలిస్టులకు, ఇంతవరకు ఎక్కడ  పట్టాలు లేని అందరి జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇయ్యాలని ఆయన కోరారు . మాకు ఇచ్చిన హామీలు నెరవెర్చి డబుల్ బెడ్ రూములు  ఇస్తే  పాదయాత్ర విరమించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఉమామహేశ్వరరావు, మోయేజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండీ రఫీ , కోశాధికారి కలీం, వర్కింగ్ ప్రెసిడెంట్ జి నరసింహులు, ఉపాధ్యక్షులు గోపాల్, డివిజనల్ కమిటీ అధ్యక్షులు పేట వెంకటయ్య , రమాకాంత్ రెడ్డి, శామ్యూల్ చారి, రామకృష్ణారెడ్డి , నవీన్ తదితరులు పాల్గొన్నారు