ఒక్క నిఘా నేత్రం (సీసీ కెమెరా) వందమంది పోలీసులతో సమానం -- జనగామ డిసిపి సీతారాం

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:54
One surveillance eye (CC camera) is equal to 100 policemen -- Janagama DCP Sitaram

బచ్చన్నపేట సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి:  ఒక్క నిఘా నేత్రం (సీసీ కెమెరా) వందమంది పోలీసులతో సమానమని   జనగామ డిసిపి సీతారాం అన్నారు.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో బుధవారం రోజున పోచన్నపేట గ్రామపంచాయతీ వద్ద సీసీ కెమెరాలను డిసిపి సీతారాం ఏసిపి దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.25 సీసీ కెమెరాలను పోచన్నపేట గ్రామంలో పలు రోడ్లకు, పలు వీధులకు ఏర్పాటు కు  సహకరించిన దాతలను డిసిపి సీతారాం అభినందించారు.ఈ సందర్భంగా డిసిపి సీతారాం, ఎసిపి దేవేందర్ రెడ్డి లు మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల    నేరాల ను నియంత్రించవచ్చని అన్నారు.సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని అని తెలిపారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగింది అని అన్నారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో,పట్టణాల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు.సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, మరియు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపినారు. నేరాలను అదుపు చేయడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగబాబు , సర్పంచ్ గట్టు మంజుల మల్లేశం,సర్పంచులు, ఎంపీటీసీ   మామిడి అరుణ ఐలయ్య  ఎస్సైలు నవీన్ కుమార్, సునీల్ కుమార్, గ్రామ నాయకులు గూడ సిద్ధారెడ్డి, కానుగంటి రాజు, భాస్కర్, ఎండి ఫిరోజ్, గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.