అలంపూర్ నియోజకవర్గానికి మినీ ఆర్టీసీ బస్ డిపో ను నిర్మించాలి

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 10:52
A mini RTC bus depot should be constructed for Alampur constituency

_ఆర్టీసీ డైరెక్టర్ సజ్జనార్ నీ కలిసిన ఎమ్మెల్యే అబ్రహం
 అల్లంపూర్, ప్రజా జ్యోతి, సెప్టెంబర్,27: హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవనంలో. తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ని వైస్ చైర్మన్ మరియు మేనేజంగ్ డైరెక్టర్ శ్రీ సజ్జనార్ ఐపీఎస్ ని కలిసిన ఎమ్మెల్యే అబ్రహం. అలంపూర్ నియోజకవర్గం లో మినీ ఆర్టీసీ డిపో ని నిర్మించాలని కోరిన అలంపూర్ శాసన సభ్యుడు  డాక్టర్ వి ఎం అబ్రహం. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గౌరవ సిఎం కేసిఆర్.కృష్ణ పుష్కరాలు సమయంలో హామీ ఇవ్వడం జరిగిందని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు. కర్నూల్ బస్ డిపో నుంచి బస్సులు నడిపేవారని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూల్ బస్ డిపో రీజియన్ నుంచి మన రాష్ట్రానికి సర్వీసులను తగ్గించడం జరిగిందని, అలంపూర్ చౌరస్తాలో బస్ డిపో నిర్మాణం చేపట్టడం ద్వారా సంవత్సరానికి 2 కోట్ల ఆదాయం ఆర్టీసీ సంస్థకు చేకూరుతుందని తెలిపారు. చైర్మన్  మరియు ఎండి మాట్లాడుతూ..ఈ విషయం తమ దృష్టిలో ఉందని తప్పకుండ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలపడం జరిగింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర రోడ్,రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అచివర్స్ మీట్-2020" లో ఆర్టీసీ చైర్మన్  మరియు ఎండి తో కలిసి అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొని,నూతన ఆర్టీసీ హైదరాబాద్ దర్శన్ బస్ సర్వీస్ ను ప్రారంభించిన అలంపూర్ శాసన సభ్యుడు డాక్టర్ వి ఎం అబ్రహం