మావోయిస్టు సానుభూతిపరుడి అరెస్ట్

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:31
Maoist sympathizer arrested

కం ట్రీ మెడ్ పిస్టల్-1, 
2 బుల్లెట్లు, 
మావోయిస్టు వారోత్సవాల  కరపత్రాలు స్వాధీనం.  
     

భూపాలపల్లి క్రైమ్ సెప్టెంబర్23 ప్రజాజ్యోతి //;. మావోయిస్టు సానుభూతి పరుడు రాజయ్య ను రేగొండ పోలీసులు శుక్రవారంనాడు అరెస్ట్ చేసిన ట్టు ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు.  జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేగొండ మండలం గాంధీ నగర్ కు చెందిన రాజయ్య సోదరుడు గతంలో పీపుల్స్ వార్ లో పనిచేసి మృతి చెందాడు అని అప్పటినుండే నక్సల్స్ తో రాజయ్య కు పరిచయాలు ఉన్నాయన్నారు.  ఈ క్రమంలో అదే మండలానికి చెందిన నక్సల్  నరేష్ ఈప్రాంతానికి వచింపుడల్లా రాజయ్య అతన్ని కలిసే వాడని అన్నారు. ఈ క్రమంలో రాజయ్య ఇంటికి వచ్చిన నరేష్ ఒక తుపాకిని రాజయ్య కు ఇచ్చి , మళ్ళీ వచ్చి తీసుకుంటామని చెప్పి వెళ్లి మళ్ళీ రాలేదని, రాజయ్య ఆ తుపాకిని తనవదే ఉంచుకున్నాడని అన్నారు. ఇటీవలి కాలంలో మావోయిస్టు నేత దామోదర్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు, భూ స్వాములు, వ్యాపార వేత్తల వివరాలు, సేకరించి అందించాలంటూ, అదే విధముగా వారోత్సవాల పోస్టర్లను గ్రామాల్లో అటించాలని అనటంతో పోస్టర్లతో శుక్రవారం నాడు వెళ్తుండగా రేగొండ టీఎస్ ఎండిసి చెక్ పోస్ట్ వద్ద పోలీసుల ను చూసి పారి పోతుండగా పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుని పరిశీలించగా అతని వద్ద నిషేధిత నక్సల్స్ కు చెందిన పోస్టర్లు, కంట్రీ మెడ్ ఆయుధం లభింఛాయని ఎస్పీ తెలిపారు. రాజయ్య ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.