బోడల్ దిన్నలో ఘనంగా అక్షరాభ్యాస సీమంతాలు కార్యక్రమాలు

Submitted by Paramesh on Mon, 19/09/2022 - 16:37
 Literacy Seemanthalu programs on Bodal Dinna

నేరేడుచర్ల సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి../   నేరేడుచర్ల మండలం లోని బోడల్ దిన్న అంగన్వాడి కేంద్రంలో సోమవారం అంగన్వాడి సూపర్వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో పోషణ ఉత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగరాణి మాట్లాడుతూ గర్భిణీలు పిల్లలు అంగన్వాడి కేంద్రాల్లో అందించే సేవలను వినియోగించుకోవాలని తద్వారా తల్లులు పిల్లలు రక్తహీనతకు గురికాకుండా బరువు తక్కువ పిల్లలు పుట్టకుండా ఉంటారని, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్లు సంధ్య ,గోరి, ఆయాలు బుజ్జమ్మ ,రాములమ్మ, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు