వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలు కొనసాగిద్దాం

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:35
Let's continue the ambitions of Veeranari Chakali Ailamma

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం.    

 సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్.      

 తొర్రూరు సెప్టెంబర్ 10( ప్రజా జ్యోతి)            
వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయాలు కొనసాగించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్ పిలుపునిచ్చారు. శనివారం వీరనారి చాకలి ఐలమ్మ 37 వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ తొర్రూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ,  అనంతరం బొల్లం అశోక్ మాట్లాడుతూ నాడు భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యెాధురాలు చాకలి ఐలమ్మ అని వారు కొనియాడారు.

 తన పంట పొలాలను కాపాడుకోవటంకోసం విస్నూర్ దొర గూండాలకు ఎదురొడ్డి కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతబట్టి   దొరల పాలనకు ఎదురు  తిరగబపొరరాడిందని అన్నారు. వీరతెలంగాణ రైతాంగ సాయధ పోరాటాన్ని రగల్చిన అగ్నికణం ఐలమ్మ. మట్టి మనుషులను, మహయెాధులుగా బాంచన్ దొరా! అన్నవారిని బందుకూలు పట్టించి విప్లవ భావాలు మండించిన నిప్పుల కొలిమి ఐలమ్మ అని గుర్తు చేశారు . ఐలమ్మ ముడతలు పడిన ముఖంలొ వెలుగులు చిమ్మే కండ్లు మెుక్కవోని ధైర్యం ఆమెది. దొర గుండాల నిర్బంధంతో తన కుటుంబం చెదిరిపోయిన కూడా, బిడ్డకు ధైర్యం చెప్పి తనయింటిని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంగా మూర్చి వీరాధివీరులకు అండగా నిల్సిందని వారన్నారు. దొరల కు వ్యతి రేకంగా పోరాటాన్ని ఉధృతపర్చి పదునెక్కించింది ఐలమ్మ ,అలాంటి వీరా వనిత ఆశయ సాధనకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన నాటి అమరవీరులను తలచుకొని తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్ 10 నుండి 17 వరకు జరపాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎండి యాకుబ్ , మండల కమిటీ సభ్యులు సోమిరెడ్డి, మార్క సాంబయ్య, జమ్మల శ్రీను , తాళ్ల వెంకటేశ్వర్లు, కొత్త వెంకట్రెడ్డి, వడూద్ పాష, తిమ్మిడి రవి మధు సతీష్ తదితరులు పాల్గొన్నారు.