మండల స్థాయి సైన్స్ సెమినార్

Submitted by sridhar on Tue, 13/09/2022 - 10:02
Zone Level Science Seminar

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 12 : మల్దకల్  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమవారం "సుస్థిర అభివృద్ధి కోసం ప్రాథమిక విజ్ఞాన శాస్త్రాలు సవాళ్లు అవకాశాలు"   అనే అంశంపై జరిగిన మండల స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు.ఈ సెమినార్ లో ఎల్కూరు, బిజ్వారం విఠలాపురం,కుర్తి రావులచెరువు,పాల్వాయి, కస్తూర్బా గాంధీ విద్యాలయం, మద్దెలబండ,అమరవాయి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.

అమరవాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతికి చెందిన నందిని జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇమ్మానియేల్ ,జానకమ్మ, నిర్వాహకులు రవి, కిరణ్ ,క్రాంతి కుమార్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.