వీఆర్‌ఏలది అర్థం లేని ఆందోళన: అసెంబ్లీలో సీఎం కేసిఆర్

Submitted by Degala Veladri on Tue, 13/09/2022 - 22:46

వీఆర్ఏలది అర్థం లేని ఆందోళన: అసెంబ్లీలో సీఎం కేసిఆర్

అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు

మానవీయ కోణంలో చాలా చేశాం

ఇరిగేషన్‌లో అర్హుల సర్దుబాటు 

పోలీస్‌ పరీక్షల్లో కటాఫ్‌ తగ్గిస్తాం: సీఎం 

బోనకల్, సెప్టెంబర్ 13 , ప్రజాజ్యోతి:

గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) అర్థంలేని ఆందోళన చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం శాసనసభలో వీఆర్‌ఏల సమస్యలను ప్రస్తావించగా అందుకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వం మానవీయ కోణంలో వీఆర్‌ఏలను ఆదుకుందని, వారి వేతనాలను పెంచిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచి నట్లే కింది స్థాయి ఉద్యోగులకూ వేతనాలు పెంచామని, నాన్‌ స్కేల్‌ వారికి దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ పెంచని విధంగా జీతాలు పెంచామని అన్నారు. వీఆర్‌ఏల్లో అర్హత ఉన్నవారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని గతంలోనే ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అర్హులైన వారిని నీటిపారుదల శాఖలో సర్దుబాటు చేస్తామన్నారు. ఇందుకోసం సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీని వేశామని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు..