రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన చరిత్రని తప్పుడు భావాలతో ప్రచారం చేస్తున్నారు: గిరి

Submitted by Degala Veladri on Sat, 17/09/2022 - 20:04
రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన చరిత్రని తప్పుడు భావాలతో ప్రచారం చేస్తున్నారు

రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన చరిత్రని తప్పుడు భావాలతో ప్రచారం చేస్తున్నారు

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు గిరి

బోనకల్,సెప్టెంబర్27, ప్రజాజ్యోతి:

తెలంగాణ ప్రజలు సెప్టెంబరు 17 ఆర్థిక రాజకీయ సామాజిక దోపిడీకి గురైన విషాదకరమైన రోజనీ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఎంగిరి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో లక్ష్మీపురం గ్రామంలో జరిగిన సమావేశంలో గిరి మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న జరిగింది విలీనం కాదు విమోచన కాదు విద్రోహం జరిగిందని అన్నారు,వివిధ రాజకీయ పార్టీలు ఓట్ల కోసం తమ రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన చరిత్రని తప్పుడు భావాలతో ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు 1946 జులై 4న తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అమరత్వంతో పోరాటం ప్రారంభం అయిందనీ,నిజాం పాలనకు వ్యతిరేకంగా రజాకార్లకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా దేశముఖ్ భూస్వాముల కి వ్యతిరేకంగా జరిగిన పోరాట ఫలితంగా మూడు వేల గ్రామాల్లో ఎర్రజెండాలు గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడి పది లక్షల ఎకరాలు భూములు పేద ప్రజలకు పంచడం జరిగింది అని ఈ దశలో సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులు భూస్వాములు కుమ్మక్కై రజాకార్ల అణిచివేసే పేరుతో తెలంగాణకి 50 వేల మంది నెహ్రూ సైన్యాలు వచ్చి మూడు సంవత్సరాల పాటు మూడు వేల మంది కమ్యూనిస్టులను నాయకుల్ని కార్యకర్తలను ప్రజలను హత్య చేసిందని ప్రజలు పోరాడి సాధించిన హక్కులను కోల్పోయి తిరిగపట్టణాలకు పారిపోయిన దొరలు మళ్లీ ప్రజలు ఆక్రమించుకున్న భూములను భూస్వాముల ఫారం కావటానికి దారితీసిందని ఆయన ఆరోపించారు ఈరోజు బిజెపి విమోచన పేరుతో ఈ పోరాటం లో ఎటువంటి పాత్ర లేని పార్టీ ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి ఇది ముస్లిములపై హిందువులు విజయంగా ప్రచారం చేయటం ఓట్ల రాజకీయంలో భాగమే తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు.సిపిఐ సిపిఎం పార్టీలు కూడా చరిత్రని సరిగా అర్థం చేసుకోకుండా విలీనం జరిగిందని చెప్పడం సరైనది కాదని ఎవరికి ఎవరు మధ్య విలీనం జరిగిందో కూడా చెప్పాలని రజాకార్లు నిజాం పాలన అంతమయ్యాక దశలో కుట్రపూరితంగా జరిగిన విషయాలను చరిత్రను చారిత్రక దృష్టితో చూడాలని ఆయన అన్నారు నిజాం కంటే నెహ్రూ సైన్యాలు హింసకాండ పాల్పడి ఎక్కువ మంది కమ్యూనిస్టులు చంపేసిందని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కాకుండా చరిత్రను చరిత్ర చూడాలని ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు ఈరోజు ద్రోహం జరిగిన రోజని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు సంఘం నాయకులు పెదప్రోలు వెంకటేశ్వర్లు పీ వై ఎల్ మండల నాయకులు గోవిందు పార్టీ నాయకులు నాగయ్య రామారావు రాజు తదితరులు పాల్గొన్నారు.