ప్లాస్టిక్ విక్రయించిన వారిపై కొరడా ఝులిపించిన కమిషనర్

Submitted by Guguloth veeranna on Fri, 18/11/2022 - 22:02
The commissioner cracked down on those who sold plastic More about this source textSource text required for additional translation information Send feedback Side panels

పాల్వంచ, నవంబర్ 18, ప్రజాజ్యోతి : మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా నిషేధిత ప్లాస్టిక్ కమ్మినచో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్ హెచ్చరించారు. పట్టణంలో ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలపై శుక్రవారం మున్సిపల్ సిబ్బంది రైడింగ్ నిర్వహించారు. ఈ రైడింగ్ లో స్థానిక రాజీవ్ గాంధీ మార్కెట్లోని రాందేవ్ ఎంటర్ ప్రైజెస్ లో 1000 కిలోల సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లు దొరికాయి. మున్సిపల్ కమిషనర్ రాందేవ్ ఎంటర్ప్రైజెస్ వారికి రూ.25వేలు జరిమానా విధించారు. అనంతరం ప్లాస్టిక్ ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పాల్వంచ పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెలిపారు.