బీసీ స్టడీ సర్కిల్ లో గ్రూప్ 3,4 ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

Submitted by Degala Veladri on Wed, 14/09/2022 - 10:13
Applications are invited for Group 3, 4 Free Training in BC Study Circle

బీసీ స్టడీ సర్కిల్ లో గ్రూప్ 3,4 ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం,

ఖమ్మం, సెప్టెంబర్ 14, ప్రజాజ్యోతి:

తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం తెలంగాణ రాష్ట్ర బీసి స్టడీ సర్కిల్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన అర్హులైన బీసీ అభ్యర్థులకు గ్రూపు 3,4, పరీక్షల కోసం ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన అభ్యర్థులు ఈనెల 15 వ తేది లోపు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఇతర వివరాలకు బీసీ స్టడీ సర్కిల్ లో సంప్రదించాలని పేర్కొన్నారు.08742-227427, 9573859598 ఈఫోన్ నెంబర్ లలో సంప్రదించాలన్నారు.