నాఇష్టం వచిన్నపుడు పూర్తి చేస్తా

Submitted by sridhar on Mon, 05/09/2022 - 17:01
I will finish when I want

(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 5 .అలంపూర్: ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామంలోఅండర్ రైల్వే బ్రిడ్జ్ పనులు నత్త కు నడక నేర్పినట్లు ఉండటం తోగ్రామం లో ఉండే ప్రజలు మాత్రం నరకానికి దారి వెతుకుంటూ పోనట్లు పోవలిసి వుంది పరిస్థితి. గ్రామంలో మధ్యలో ఉన్న no 108 లేవల్ క్రాసింగ్ గేట్ స్వార్థం రాజకీయలకోసం మార్పు చేయించి ఎక్కడైనా నాకేం అన్నట్లు కాంట్రాక్ట్, గ్రామ అధికారి  రాజకీయ నాయకులు కుమ్మకై పనులు టైమ్ బండ్ లేకుండా మమ్ములను అడిగేవాడు ఎవరు అన్నట్లు పనులను చేస్తూ  ప్రజలను తీవ్ర ఇబంధులకు గురించేస్తున్నారు. వర్షం పడితే పరిస్థితి ఇది గ్రామం మధ్యలో బ్రిడ్జి ఉండటం వలన రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి,

పంటపొలలకు మందు సంచులు తీసుకొని పోయేవారిపరిస్థితి చెప్పానాక్కరలేదు.అభివృద్ధి కాగితాలపై అన్నట్లు ఉంది. రాష్టం ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి పల్లె ప్రగతి పేరు తో అభివృద్ధి చేసేలాప్రణాళికలు  తయారు చేసి పనులను చేయని అద్దెశించినప్పటికి అధికారుల ఆదేశాలు నీటిమీద గీతాలు అన్నట్లు గ్రామ అభివృద్ధి వుంది. పేరుకు, బిల్లులకు మాత్రమే పారిశుధ్య పనులు  పోరక పట్టేదిలేదు ఊడ్చేది అసలే లేదు. అంతే కాదు  గ్రామములో పనులు చేయాలి అని అడిగితే  నన్ను ఎవరు అడుగకూడదు అని అంటున్న గ్రామ సెక్రెటరీ  దీని పై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు