మానవతా విలువలను పెంపొందించాలి బాల అదాలత్ బెంచ్ కార్యక్రమం పై ప్రశంసలు

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 17:02
Human values ​​should be developed Appreciation for the Child Adalat Bench Program

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హనుమకొండ, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి)...../    
పిల్లలకు చిన్ననాటినుండే మానవతా విలువలను పెంపొందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం రోజున  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాల అదాలత్ బెంచ్ ప్రారంభోత్సవ సభా కార్యక్రమం ఎస్సీపిసిఆర్ సభ్యులు యెడ్లపల్లి బృందాధర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ కుమార్ మాట్లాడుతూ బాలలపై హింస, అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని ఇలాంటి హృదయ విదారక సంఘటనలు మానవ జాతిలో మాత్రమే జరుగుచున్నాయని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చిన్న నాటినుండి పిల్లలకు మానవతా విలువలు పెంపొందించాలని అన్నారు. పిల్లలకు సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి తల్లి అక్కా చెల్లీ అవగాహన కల్పించాలని, సమీప బంధువుల నుండే బాల బాలికలు లైంగిక దాడులకు గురువుచున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. లైంగిక నేరాలపై అప్రమత్తత అవసరం అని అన్నారు, పొక్సో చట్టం 2012,బాలల రక్షణ సంరక్షణ కోసం బాలల న్యాయ చట్టం 2015, ఉందని బాలల రక్షణ సంరక్షణ లో ప్రభుత్వం విఫలమైనప్పుడు కమిషన్ కు చర్యలు తీసుకొనే అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీసుకునే ప్రతి నిర్ణయం సాహసోపేత నిర్ణయమని, బాలల రక్షణ కోసం తీసుకునే చర్యలు దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జోగినపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఒక రోజంతా బాలల సమస్యల పరిష్కారం కోసం వేదిక ఏర్పాటు చేసి వారు ఎలాంటి సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నారో స్వయంగా తెలుసుకొని వారికి పరిష్కారం చూపడానికి బాల అదాలత్ బెంచ్ ఏర్పాటు చేసామని అన్నారు. బాల బాలికల విద్య వైద్యం ఆరోగ్యం పౌష్టికాహారం, వారిపై జరిగే హింసాత్మక సంఘటనలపై కమిషన్ స్పందించి చర్యలు తీసుకుంటుందని అన్నారు.

బాల బాలికలు వారి హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని, ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ బాలల సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో బాల అదాలత్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని, జిల్లా అధికారుల సమన్వయంతో వారం రోజుల కార్యాచరణతో కార్యక్రమ విజయవంతం కావడానికి ప్రజలకు చేరువయ్యామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఏ శోభారాణి, సిహెచ్ రాగ జ్యోతి, ఏ దేవయ్య, అపర్ణ, అంజన్ రావు, జిల్లా సంక్షేమ అధికారి ఎం.సబిత, ఆర్జేడీ ఝాన్సి లక్ష్మి బాయి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పి సుధాకర్, ఎస్ రాజేంద్ర ప్రసాద్, పి హైమావతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మౌనిక,సతీష్ కుమార్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ రాగి కృష్ణ మూర్తి, ఎండి ఇక్బాల్ పాషా, జిల్లాలోని అయా ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.