విద్యను బోధించే గురువుకే అత్యున్నతమైన గౌరవం

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 14:41
The highest honor is given to the teacher who teaches education

 పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి):  సమాజంలో విద్యను బోధించే గురువుకి అత్యున్నతమైన గౌరవం దక్కుతుందని మండల ఎంపిపి నెమ్మది బిక్షం అన్నారు. బుధవారం మండల విద్యాధికారి నకిరేకంటి రవి అధ్యక్షతన నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతో 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వేలాది మంది సాధారణ పేద పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతున్న ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని వారి సేవలు అభినందనీయం అన్నారు రాష్ట్ర,జిల్లా, మండల   ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన మామిడి వెంకన్న, ఎం కిరణ్ సింగ్, నల్ల శ్రీనివాస్,వి మధుసూదన్ రెడ్డి,కే ప్రభాకర్, బి సతీష్,ఎస్కే ఆసియా బేగం, డి అనిత,శేఖర్,మునిషా,పీ శ్రీనివాస్,జి వెంకటేశ్వర్లు, ఆర్ శ్రీదేవి, బి భాగ్యలక్ష్మి,సిహెచ్ కృష్ణయ్య, జి సుశీల,ఏ చంద్రశేఖర్,కే వీరేంద్ర,ఏం సావిత్రి,కే లక్ష్మయ్య, బి రమేష్,ఏ బ్రహ్మచారి, బి జాను,వి సుదర్శన్,రమేష్, ఎం డి రషీద్ జానీ, వై నిర్మల, యేసయ్య,ఏం సైదులు లను పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా వివిధ పాఠశాలల్లో వీరు అందించిన అందిస్తున్న  సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ శేషగిరిరావు, ఇన్చార్జి ఎంపీడీవో బాణాల శ్రీనివాసు,సర్పంచ్ శ్వేత సురేష్ రావు,ఎంపీటీసీ ఊరుకొండ జానకమ్మ రాధాకృష్ణ,ఉపాధ్యాయ సంఘాల పెద్దలు ఉపాధ్యాయులు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.