గ్రూప్-1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య

Submitted by lenin guduru on Sat, 24/09/2022 - 14:16
 Group-1 exams should be conducted in armour  District Collector CH Sivalingaiah

జనగామ, సెప్టెంబర్ 23. ప్రజాజ్యోతి:- జిల్లాలో నిర్వహించబోయే గ్రూప్ వన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించటానికి పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలెక్టర్ డిసిపి సీతారాంతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 16వ తేదీన జిల్లాలో 14 కేంద్రాల్లో నిర్వహించే గ్రూప్ వన్ పరీక్షలకు సుమారు మూడు వేలమందికి పైగా హాజరవుతున్నట్లు తెలియజేశారు. ఈ పరీక్షల నిర్వహణకు అదనపు కలెక్టర్ జిల్లా కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారని తెలియజేశారు.పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు నిర్వహణ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాలన్నింటిలోనూ త్రాగునీరు మరుగుదొడ్ల సౌకర్యాలు ఉండాలన్నారు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారుఅన్ని పరీక్ష కేంద్రాలలో ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష వ్రాసేందుకు జిల్లాకు చేరుకుంటున్న అభ్యర్థులకు ఆయా పరీక్ష కేంద్రాల ప్రదేశాలు తెలిపేలా రూట్ మ్యాప్ లను బ్యానర్ గా రూపొందించి బస్టాండ్ లోనూ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి ప్రదర్శింప చేయాలన్నారు.ఆర్టిసి బస్సులు కూడా అభ్యర్థులు ఆయా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు పరీక్ష సమయాల్లో నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ని ఆదేశించారు.


ప్రతి కళాశాలలోనూ పరీక్షలు వ్రాసే అభ్యర్థుల సెల్ ఫోన్లు బ్యాగులు భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.అదేవిధంగా ప్రతి కళాశాలలోనూ రూల్ నెంబరు మొదటి నుండి చివరి వరకు కేటాయించిన నెంబర్లకు రూములవారీగా బ్యానర్ను రూపొందించి ప్రదర్శింప చేయాలన్నారు.డిసిపి సీతారాం మాట్లాడుతూ ప్రతి సెంటర్కు ఎస్సై లను నియమిస్తామని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు పేపర్ కలెక్షన్ సెంటర్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు అవసరమైన చోట బార్కేటింగ్ కూడా చేపడతామన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఏ సి పి దేవేందర్ రెడ్డి, ఆర్డిఓ మధుమోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము, మున్సిపల్ కమిషనర్ రజిత, అధికారులు వివిధ ప్రభుత్వ ప్రవేట్ కళాశాలల ప్రిన్సిపల్స్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.