ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

Submitted by Yellaia kondag… on Mon, 26/09/2022 - 13:25
Grand Angilipula Bathukamma celebrations

తుంగతుర్తి, సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి): రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు మండల వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. ఎంగిలిపూల తో ఆదివారం నుండి బతుకమ్మ ఆటపాటలు మొదలయ్యాయి. తుంగతుర్తి మండల కేంద్రంలో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలలోని ఇంటింటా మహిళలు రంగురంగు పూలతో బతుకమ్మలు పేర్చుకోని ప్రత్యేక పూజలు చేసి ప్రధాన కూడళ్లలో ఆటపాటలా డారు. ఒక్కేసి పువ్వేసి చందమామ రెండు జాములాయే చందమామ అని బతుకమ్మ విశిష్టతను తెలుపుతూ ఆడపడుచులు పాటలు పాడారు. ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి మహిళలు గుంపుగా చేరి ఆటలు ఆడిన అనంతరం సమీపంలోని చెరువులు, కుంటలలో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ వేడుకలలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.