పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య... బాసర గోదావరిలో ఘటన... నిజామాబాద్ పెద్ద బజారుకు చెందిన కుటుంబం...

Submitted by SANJEEVAIAH on Mon, 23/01/2023 - 16:13
ఫోటో

కుటుంబం ఊపిరి తీసిన సమస్యలు

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

బాసర గోదావరి లో ఘటన 

నిజామాబాద్ (బాసర), ప్రజాజ్యోతి, జనవరి 23 :

నిర్మల్ జిల్లా బాసర మండలంలో   గోదావరిలో నదిలో దూకి తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలను ముధోల్ సీఐ వినోద్ రెడ్డి వివరాల మీడియాకు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మానస ( 27) కుమారుడు బాలాదిత్య( 9) కుమార్తె భాగ్యశ్రీ (5)  లు ఈరోజు ఉదయం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిది మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం బండారుపల్లి గ్రామం. భర్త వెంకటేష్ గత నాలుగు సంవత్సరాల క్రితం చనిపోవడంతో తల్లిగారి ఇంటి వద్ద నిజామాబాద్ కు వచ్చి నివాసం ఉంటున్నారు. నిజామాబాద్ పెద్ద బజారులో ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్న తమ్ముడు నవీన్ తో కలిసి ఉంటున్నారు. రాధాకృష్ణ ప్రవేటు పాఠశాలలో భావ్యదీత్య, భవ్యశ్రీ లు చదువుతుండగా తల్లి మనస ఎల్విఆర్ షాపింగ్ మాల్ లో గుమస్తాగా పని చేస్తున్నారు. ఈ మెడకు బాసర ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.