సర్వసభ్య సమావేశం లో రైతులకు సాగు నీరు విడుదల చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం

Submitted by Paramesh on Tue, 20/09/2022 - 14:50
In the general meeting, it was unanimously resolved to release cultivation water to the farmers

అక్రమంగా మట్టిని తరలిస్తే వాహనాలను సీజ్ చేస్తాం 


నేరేడు చర్ల, సెప్టెంబర్ 20(ప్రజా జ్యోతి):  నేరేడు చర్ల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపిపి లక్కుమళ్ళ జ్యోతీ భిక్షం అద్యక్షతన అన్నీ శాఖల అధికారులతో సర్వసభా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు సభ్యులు ఏకగ్రీవంగా రైతులకు సాగు నీరు విడుదల చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మండల పరిధిలో విచ్చల విడిగా రోడ్లపై అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సభ్యులు ప్రశ్నించగా మట్టిని మైనింగ్ శాఖ ద్వార పర్మిషన్ తీసుకుని మట్టి రవాణా చెయాలి లెని పక్షంలో అక్రమంగా మట్టిని తరలిస్తే అట్టి వాహనాలపై కెసు నమోదు చేసి బండిని సిజ్ చేస్తామని రెవిన్యూ అధికారులు తెలిపారు. విద్యుత్ ఏఈ శ్రినువాస్ మాట్లాడుతూ రైతులకు వచ్చినటువంటి 85ట్రాన్స్ ఫారం లు సప్లైచేసినట్లు తెలిపారు. అలాగే లేవెన్ కివి క్రింద మిడిల్ పోల్స్ 75వరకు వర్కు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రైతులకు 12గంటల కరేంట్ సప్లయ్ వస్తున్నట్లు తెలిపారు. విద్యా శాఖ యం ఈ ఓ చత్రునాయక్ మాట్లడుతూ యం ఈ ఓ ఆఫీస్ కు వెళ్ళే రోడ్డు చాలా ఘోరంగా గుంటలు పడి వున్నదని అలాగే పక్కనే ఉన్న మిషన్ భగీరథ ట్యాంకు ద్వారా ఓవర్ అయినా నీరు రోడ్డు పైకి వచ్చి వాహనాలు రోడ్డుపై దిగబడుతున్నాయి అని అన్నారు. ఎన్ని సార్లు చెప్పినా రోడ్డు ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైన అధికారులూ స్పందించింది యం ఈ ఒ ఆఫీస్ రోడ్డుకు వాహనాలు నడిచే విధంగా మరమత్తులు చేయాలనీ తెలిపారు. రోళ్ళ వారి గూడెం గ్రామ సర్పంచ్ మా గ్రామంలో మిషన్ భగీరథ ద్వార నల్లా లకు వాటర్ రావడం లేదని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ఏ ఇ మాట్లాడుతూ నల్లా లకు సప్లై వచ్చే విధంగా చూస్తామని అన్నారు. వ్యవసాయ శాఖ ఏ ఇ ఓ మాట్లడుతూ ఇంకా ఇ కె వై సి చేసుకొని రైతులు 2500మంది వున్నరని వీళ్ళందరూ కూడా మీ సేవ కేంద్రాల ద్వారా ఇ కే వై సి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శంకరయ్య, జెట్పిటిసి రాపోలు నర్సయ్య వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీ నారాయణ డిప్యూటి తహసీల్దార్ స్రవంతి ఇ ఓ పి అర్ డి విజయ కుమారి పీ హెచ్ సీ డాక్టర్ నాగయ్య యం పషు సంవర్ధన డాక్టర్ రవి నాయక్  చిల్లేపల్లి వైకుంఠపురం సర్పంచ్ మనోజ్ అమృతా రెడ్డీ పెంచికల్ దిన్న ఎంపీటీసి లింగయ్య అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు